ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సూపర్ స్టార్
మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆయన తన తాజా సినిమా 'కాసనోవా" షూటింగులో భాగంగా బ్యాంకాక్ లో ఉన్నారు. ఇక్కడ పలు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా మోహన్ లాల్ పై బైక్ రేసింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా...ఆయన బైక్ ప్రయాణిస్తున్న బైక్ 40 అడుగు ఎత్తు నుంచి పడి పోయినట్లు తెలుస్తూంది. అయితే అదృష్ట వశాత్తు మోహన్ లాల్ స్వల్ప గాయాలతో బయట పడ్డారని యూనిట్ సభ్యుల సమాచారం. వెంటనే అతన్ని ఆసుప్రతికి తరలించారు. ఈ సంఘటనతో 'కాసనోవా" షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.
ఈ ఘటనతో మోహన్ లాల్ అభిమానులు షాక్ తిన్నారు. ఇటీవల జరిగిన పలు బైక్ ప్రమాదాల్లో సినీ ప్రముఖులు కోట, బాబు మోహన్, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తనయులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదాలకు, ఈ సంఘటనకు పొంతన లేకున్నా...బైక్ యాక్సిడెంట్ పేరు వినిపిస్తే చాలు సీని అభిమానులు ఉలిక్కి పడుతున్నారు.


Click it and Unblock the Notifications