twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెజవాడ సినిమాలో విలన్‌గా మోహన రంగా?

    By Bojja Kumar
    |

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినీ కెరీర్లో భారీ హిట్ సినిమాలు కేవలం వేళ్ల మీద లెక్క పెట్టగలిగేవి ఉన్నప్పటికీ....వివాదాస్పద సంఘటనలు, వివాదాస్పద అంశాలతో సినిమాలు తీస్తూ దర్శకుడిగా పాపులర్ అయ్యాడు. వర్మ ఆ మధ్య రూపొందించిన రక్త చరిత్ర ఏ రేంజ్ లో చర్చనీయాంశమైందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా కరడుగట్టిన ఫ్యాక్షన్ లీడర్లు పరిటాల రవి, మద్దెలచెర్వు సూరి జీవితం ఆధారం కావడమే ఇందుకు కారణం.

    తాజాగా వర్మ ఫ్యాక్టరీ నుంచి రూపొందుతున్న సినిమా 'బెజవాడ". నాగచైతన్య, అమల పాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు వర్మ శిష్యుడు వివేక్ కృష్ణ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఓ బలమైన సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఒకప్పటి లీడర్ వంగవీటి మోహనరంగను విలన్ గా చూపించ బోతున్నాడటని విశ్వసనీయం సమాచారం.

    80ల్లో జరిగిన ముఠా తగాదాల్లో రంగా హత్యకు గరయ్యాడు. అయితే రంగా హత్య వెనక కారణాలను సినిమాలో చూపుతూ..అతని విలనిజాన్ని భరించలేకనే ప్రత్యర్థులు ఆయన్ను మట్టుబెట్టారనే కోణం ఈ సినిమాలో కనిపించనుందట. మరి...మోహనరంగ గురించి వర్మ ఏం చూపించాడో? తెలియాలంటే 'బెజవాడ" విడుదల దాకా ఆగాల్సిందే.

    English summary
    It is heard that Ram Gopal Varma's upcoming film 'Bezawada' would be projected Vangaveeti Mohana Ranga would be essayed as the Villain.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X