సుశాంత్ మరణానికి ముందు.. రియా చక్రవర్తి నన్ను కలిసింది.. ఆధ్యాత్మిక గురువు మోహన్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత వెలుగు చూస్తున్న చాలా విషయాలు చూస్తున్నాయి. తాజాగా సుశాంత్ మానసిక స్థితి గురించి ఆధ్యాత్మిక గురువు మోహన్ సదాశివ్ జోషి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సుశాంత్ డిప్రెషన్ గురించి ఆయన లవర్ రియా చక్రవర్తి తనతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. చాలాసార్లు నాతో సుశాంత్ మానసిక ఆరోగ్యం గురించి చర్చించారని పేర్కొన్నారు.

సుశాంత్ డిప్రెషన్‌తో బాధపడుతున్నారని రియా చక్రవర్తి నా వద్దకు వచ్చింది. ఆయన మానసిక రుగ్మతకు చికిత్స చేయాలని అడిగారు. దాంతో నేను ఆయనకు చికిత్స చేశాను. దాదాపు 90 శాతం డిప్రెషన్ తగ్గింది. డిప్రెషన్‌ తగ్గించుకోవడానికి రెండుసార్లు సుశాంత్ నన్ను కలిశారు. గతేడాది నవంబర్‌లో నన్ను కలిసి తన సమస్యలను చెప్పుకొన్నారు అని మోహన్ సదాశివ్ తెలిపారు.

Mohan Sadashiv Joshi revealed: Rhea approached for Sushant Singh Rajputs treatment

సుశాంత్ సింగ్ గురించి ఎక్కువ సార్లు నాతో రియానే మాట్లాడింది. ఆమె తప్ప మరెవరూ మాట్లాడినట్టు గుర్తు లేదు. సుశాంత్ మరణం తర్వాత నాకు బాంద్రా పోలీసులు సమన్లు పంపారు. ఆయన మరణం, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను రికార్డు చేసేందుకు రమ్మన్నారు. కానీ నేను అనారోగ్యంతో బాధపడతున్నందున్న, వయోభారం, ఇతర సమస్యల కారణంగా నేను విచారణకు హాజరుకాలేదు అని మోహన్ సదాశివ్ జోషి పేర్కొన్నారు.

జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించారనే వార్త సినీ లోకాన్ని కుదిపేసింది. అయితే అందరూ అతనిది ఆత్మహత్యే అని భావించారు. కానీ ఆ తర్వాత సుశాంత్ విషయంలో రియా చక్రవర్తి అనుసరించిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సుశాంత్‌ది ఆత్మహత్య కాదనే అనుమానం రోజు రోజుకు బలపడుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X