నానికి పోటాపోటిగా.. సుధీర్ బాబును తక్కువ అంచనా వేయొద్దు.. ఇంద్రగంటి

టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన సుధీర్ బాబు విభిన్నమైన పాత్రల్లో నటించడానికి తాపత్రయ పడుతుంటారనేది ఆయన నటించిన సినిమాలే చెబుతాయి. తెలుగు పరిశ్రమలో బలమైన బ్యాకప్ ఉన్నప్పటికీ తనకంటూ గుర్తింపు పొందాలనే కృతి నిశ్చయంతో యే మాయ చేశావే చిత్రంతో ఒంటరిగానే ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం, ఆడు మగాడ్రా బుజ్జి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ చిత్రాలతో తనేంటో నిరూపించారుకొన్నారు. తాజాగా కమర్షియల్ హీరోగా V చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా సుధీర్ పెర్ఫార్మెన్స్‌‌పై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో

పోలీస్ ఆఫీసర్ పాత్రలో

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా తనదైన శైలిలో రాణిస్తున్నారు. మోసగాళ్లకు మోసగాడు, భలే మంచి రోజు, శమంతకమణి, సమ్మోహనం చిత్రాల్లో నటుడిగా పరిణితో కూడిన నటనను ప్రదర్శించారు. పుష్కలమైన ప్రతిభ ఉన్నప్పటికీ.. సుధీర్‌లో అంతకు మించిన పాత్ర కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకులు, అభిమానుల అంచనాలు మించి సుధీర్ బాబు వీ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారనే మాట సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది.

V మూవీలో ది బెస్ట్ అంటూ..

V మూవీలో ది బెస్ట్ అంటూ..

V చిత్రంలో నేచురల్ స్టార్ నానితో కలిసి పోటాపోటీగా సుధీర్ బాబు నటించారనే విషయం ఇండస్ట్రీలో మార్మోగుతున్నది. ఈ చిత్రంలోని సుధీర్ బాబు పాత్ర ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్ అనే మాట ప్రచారంలో ఉంది. వీ చిత్రంతో పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా మారడం ఖాయమని చిత్ర యూనిట్ స్పష్టం చేస్తున్నది. నభూతో నభవిష్యత్ అనే రేంజ్‌లో సుధీర్ బాబు నటన ఉంటుందనే చెప్పుకొంటున్నారు.

సుధీర్ బాబు గురించి ఇంద్రగంటి

సుధీర్ బాబు గురించి ఇంద్రగంటి

సుధీర్ బాబు పాత్ర గురించి దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. V మూవీ నాని కెరీర్‌లో ప్రత్యేకం కావొచ్చు. కానీ సుధీర్ బాబు ప్రతిభను, నటనకు సంబంధించిన శక్తి, సామర్థ్యాలు ఏంటో ఈ సినిమాలో కనిపిస్తాయి. సమ్మోహనం సినిమా సమయంలోనే సుధీర్ బాబు ఏంటో తెలుసుకొన్నాను. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్‌ను తక్కువగా వాడుకొంటున్నామనే ఫీలింగ్ ఉంది. V మూవీతో ఆ అపోహలు చెల్లాచెదురు కావడం తథ్యం అని ఇంద్రగంటి అన్నారు.

సుధీర్ బాబు పెర్ఫార్మెన్స్ బ్రిల్లియెంట్

సుధీర్ బాబు పెర్ఫార్మెన్స్ బ్రిల్లియెంట్

V మూవీలో సుధీర్ బాబు యాక్టింగ్, ఫెర్ఫార్మెన్స్ బ్రిల్లియెంట్. నానితో పోటాపోటీగా నటించారు. ఇద్దరికి సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో రెండు పాత్రలకు బ్యాలెన్స్ ఉంటుంది. ఓవరాల్‌గా సుధీర్ బాబు ఏంటో, అతని ప్రతిభ ఎంటో V మూవీ చెబుతుంది అనే ఇంద్రగంటి విశ్వాసాన్ని ప్రకటించారు.

బాలీవుడ్‌లో కూడా యాక్టింగ్‌తో

బాలీవుడ్‌లో కూడా యాక్టింగ్‌తో


ఇదిలా ఉండగా, సుధీర్ బాబు కెరీర్ కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాలేదు. వర్షం సినిమా రీమేక్ తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం భాగీ చిత్రంలో సుధీర్ బాబు ఫెర్ఫార్మెన్స్‌కు బ్రహ్మండమైన ప్రశంసలు దక్కాయి. ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే సత్తా సుధీర్ బాబులో ఉందనే విషయం బాలీవుడ్‌లో వ్యక్తమైంది. ఇక నటుడే కాకుండా రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో పుల్లెల గోపిచంద్‌తో బాడ్మింటన్ ఆడిన ఘనత కూడా ఆయన సొంతం కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X