బెజవాడలో...‘బెజవాడ’సినిమా ప్లెక్సీల కలకలం

అయితే...మరో రెండు రోజుల్లో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో దేవినేని కుటుంబానికి చెందిన యువనేత అవినాష్ విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. ''ఆనాడు దేవినేని సోదరులు సృష్టించిన చరిత్ర బెజవాడ సినిమాలో చూడండి"" అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్లెక్సీ ఏర్పాటు చేశాడు అవినాష్. ఈ ప్లెక్సీ వల్ల విజయవాడలో ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉండటంతో పోలీసులు వెంటనే ఆ ప్లెక్సీని తొలగించారు.
వర్మ బెజవాడ సినిమా రూపొందించడాని ముందు దేవినేని నెహ్రూ కుటుంబాన్ని కలిశాడు. తాజాగా అవినాష్ ప్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీన్ని బట్టి బెజవాడ సినిమాలో విజయవాడ గత చరిత్ర ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. సినిమాలో దేవినేని, వంగవీటి కుంటుబాలకు చెందిన వారి పాత్రలు తప్పకుండా ఉంటాయని అంతా నమ్ముతున్నారు. అవినాష్ సినిమా చూడండి అని ప్లెక్సీ ఏర్పాటు చేసినందున ఇందులో దేవినేని సోదరులను హీరోగా, వారి ప్రత్యర్థి అయిన వంగీవీటి మోహన రంగాను విలన్‌గా చూపించబోతున్నారనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
తన సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే వర్మ ఈ విషయాన్ని దాచి...కల్పిత కథ అంటూ కహానీలు చెబుతున్నాడని మరికొందరు అనుమాన పడుతున్నారు. ఏది ఏమైనా సినిమా విడుదలైతేగానీ అసలు విషయం తెలియదే.
ఈ చిత్రంలో నాగచైతన్య, అమలపాల్ జంటగా నటిస్తుండగా వర్మ శిష్యుడు వివేక్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ, కిరణ్ కుమార్ కోనేరు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.


Click it and Unblock the Notifications











