తెలుగు సినిమా స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్మాత కెయస్ రామారావుపై నటుడు మోహన్ బాబు నిప్పులు చెరిగిన మాట నిజమే కదా...హూ ఈజ్ దిస్ సిల్లీ ఫెల్లో...డైలాగ్ రామారావు చెవుల్లో ఇప్పటికి కూడా రింగ్ మంటుండవచ్చు...కానీ ఇపుడొక విచిత్రం జరుగుతోంది. అదేమంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా బుజ్జిగాడు-మేడిన్ చెన్నయ్ సినిమాను కెయస్ రామారావు నిర్మిస్తున్నాడు. ఇదేం వార్త కాదు కానీ ఈ సినిమాలో మోహన్ బాబు నటిస్తున్నాడు. తిట్టినవాడే ఆయన సినిమాలో నటిస్తున్నాడు...ఇదేమబ్బా అనుకోవచ్చు కానీ...నటించమని అడిగిందెవరనేదే ఇక్కడ లాజిక్కు....మోహన్ బాబు...నన్ను అడిగారు కాబట్టే నటిస్తున్నాననవచ్చు...పూరి పెట్టుకుంటే నేనేం చేసేదని కేయస్ రామారావు అనుకోవచ్చు.... ఏదేమైనా మంచే జరగబోతోంది...తెలుగు సినిమాకే.