చిరును పరామర్శించిన బాలయ్య, మోహన్ బాబు
చిరంజీవి తండ్రి భౌతిక కాయాన్ని ప్రముఖ నటులు కృష్ణం రాజు, బాలకృష్ణ, మోహన్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, శివాజీ రాజా, బాబూ మోహన్ లతో పాటు దర్శకులు శేఖర్ కమ్ముల తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బాబూ మోహన్ మాట్లాడుతూ మాయలోడు సినిమాలో తన పాత్రను చూసి వెంకట్రావు గారు తనను మెచ్చుకున్నారని, ఆ సినిమాను వెంకట్రావు గారు రెండుమార్లు చూసినట్టు చిరంజీవియే స్వయంగా చెప్పారని, తాను మెగా స్టార్ ను అయినా తన తండ్రి నీ అభిమానులని చెప్పడం మరిచిపోలేని అంశమని బాబూ మోహన్ ఈ సందర్బంగా వెంకట్రావును గుర్తుచేసుకున్నారు. ఎన్నోమార్లు వెంకట్రావును కలిసానని అన్న బాబూ మోహన్ పుట్టిన ప్రతివారు గిట్టక మానరని, వెంకట్రావు గారు ఇపుడు స్వర్గస్తులయ్యారని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











