డా.మోహన్బాబు..దళితనాయకుడు
విలక్షణ నటుడు మోహన్‌బాబు తొలిసారిగా ఒక దళిత నాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. తన గురువు, దర్శకరత్న దాసరి నా రాయణరావు టైటిల్ పాత్రను పోషిస్తున్న 'మేస్త్రి' చిత్రంలో దాదాపు పా వుగంటసేపు కనిపించే దళిత నాయకుడి పాత్రలో మోహన్‌బాబు నటించనున్నారన్నది ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తున్న తాజా వార్త. ఈ 15 నిముషాల ఎపిసోడ్‌కే రూ. 3 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది.
అలాగే దాసరి మరో శిష్యుడు శ్రీహరి కూడా ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుండడం విశేషం. రా నున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 'మేస్త్రి' ఓ రాజకీయ వ్యంగ్య చిత్రంగా రూపొందుతోందని సమాచారం. ఈ చిత్రాన్ని నాలుగు వందల ప్రింట్లతో సంక్రాంతికి విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











