Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మోహన్‌బాబుతో ముత్యాల సుబ్బయ్య
కలెక్షన్ కింగ్‌గా పేరున్నా కొంతకాలంగా సరైన హిట్స్ కోసం హీరో మోహన్‌బాబు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన జూనియర్ దర్శకులతో కొన్ని ప్రయోగాలు చేసి విసిగిపోయారు. ఇటీవల విడుదలైన పొలిటికల్ బ్రదర్స్, గేమ్ చిత్రాలు మోహన్‌బాబుకు నిరాశనే మిగిల్చాయి. ఈసారి మళ్లీ ఆయన పాత బాణీలోకి మళ్లాలని ఆలోచిస్తున్నారు. గతంలో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి.. కొద్దికాలంగా గ్యాప్ తీసుకున్న ముత్యాల సుబ్బయ్య మోహన్‌బాబు కోసం ఒక కథ సిద్ధం చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్‌బాబు ఆఫీస్‌లో కథాచర్చలు జోరుగా జరుగుతున్నాయి. హీరోగా మోహన్‌బాబు ఇంతవరకూ చేయని ఒక వెరైటీ పాత్రను పోషించబోతున్నారు.
దర్శకుడు ముత్యాల సుబ్బయ్య చివరి చిత్రం - రాజశేఖర్ హీరోగా నిర్మించిన - ఆప్తుడు. ఆ చిత్రంలో జీవిత జోక్యం ఎక్కువ కావడం వల్ల ముత్యాల సుబ్బయ్య వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. పైగా కథ కూడా ఎప్పుడో పదేళ్ల కిందట హిందీలో వచ్చిన ఘాతక్ చిత్ర ఇతివృత్తమే కావడంతో ముత్యాల సుబ్బయ్య సరైన న్యాయం చేయలేకపోయారు. చిరంజీవి అన్నయ్య చిత్రం వరకూ వరుస హిట్లు ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు మళ్లీ మంచి కథ, అందుకు తగ్గ హీరో మోహన్‌బాబు దొరకడంతో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.