మోహన్ బాబా-సాయిబాబా
మోహన్ బాబు స్వతహాగా సాయిబాబా భక్తుడు. ఇపుడు సాయిబాబాగా మోహన్ బాబు తెరమీద కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన యమదొంగలో యమధర్మరాజు పాత్రను పోషించి మోహన్ బాబు తన సత్తా చూపాడు. ఇపుడు తన కుమారుడు విష్ణు హీరోగా రూపొందుతున్న సినిమాలో సాయి బాబా గా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కొంచమే అయినా ఆ పాత్రను చేయడానికి మోహన్ బాబు ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తోంది.
తన నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ టెలివిజన్ ప్రొడక్షన్ లో కూడా ప్రవేశించిందని మోహన్ బాబు తెలిపాడు. తమ సంస్థ క్వాలిటీ సీరియళ్ల నిర్మాణానికి పూనుకుంటుందని చెప్పాడు. తమ సంస్థ పలు రంగాల్లో అడుగు పెట్టనున్నట్టు ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications











