India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'అఖండ' సినిమాలకు ధైర్యాన్నిచ్చింది..పరిశ్రమకి మళ్లీ ఊపిరి పోసింది.. మోహన్ బాబు ప్రసంశల వర్షం!

  |

  నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'సింహా', 'లెజెండ్' సినిమా హిట్ అవడంతో వీళ్లిద్దరూ కలిసి చేసిన మూడో చిత్రం 'అఖండ' మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి హిట్ దిశగా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా మీద ముందు నుంచి ప్రశంశల వర్షం కురుస్తూ ఉండగా ఇప్పుడు మంచు మోహన్ బాబు ప్రసంశలు కురిపించారు. ఆ వివరాల్లోకి వెళితే

  డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు

  డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు

  నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా 'అఖండ'. ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన నిర్మించగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ, నితిన్ మెహతా, సుబ్బరాజు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

  భారీ వసూళ్లు

  భారీ వసూళ్లు

  బాలకృష్ణకు మన రెండు రాష్ట్రాలలోనే కాక కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా ఉన్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు బోయపాటి శ్రీను కాంబో అంచనాలు కూడా తోడు కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే 'అఖండ' మూవీకి నాలుగు రోజులకు గాను భారీ వసూళ్లు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 37.56 కోట్లు షేర్, రూ. 59.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

  సోషల్‌ మీడియాలో

  సోషల్‌ మీడియాలో

  ఇక బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న 'అఖండ' సినిమాపై పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌, కల్యాణ్‌ రామ్‌, దర్శకులు గోపీచంద్ మలినేని, అనిల్‌ రావిపూడి వంటి వారు ఈ సినిమాను చూసి తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పంచుకున్న సంగతి తెలిసిందే.

  ప్రేక్షక దేవుళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు

  ప్రేక్షక దేవుళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు

  తాజాగా మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ 'అఖండ' సినిమాను ప్రశంసిస్తూ ఏకంగా ఒక ప్రకటన విడుదల చేసింది. 'కరోనా ప్రభావంతో థియేటర్లకి ప్రేక్షకులు రారు.. చూడరు అనుకుంటున్న క్లిష్టపరిస్థితుల్లో 'అఖండ' సినిమా విజ‌యం సినీ పరిశ్రమకి మళ్లీ ఊపిరి పోసింది. విడుదలకు సిద్ధంగా ఉన్న మరికొన్ని సినిమాలకు ధైర్యాన్నిచ్చింది. నా సోదరుడు బాలయ్యకు, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. అదేవిధంగా ఈ మంచి సినిమాని ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ మోహన్‌బాబు పేర్కొన్నారు.

  Shilpa Chowdary Case : Tollywood Hero Loses | Mahesh Babu Sister || Filmibeat Telugu
  అన్‌ స్టాపబుల్‌' విత్ ఎన్‌బీకే

  అన్‌ స్టాపబుల్‌' విత్ ఎన్‌బీకే

  ఇక ఈ మధ్య బాలకృష్ణ హోస్ట్ గా 'ఆహా'లో ప్రసారమైన 'అన్‌ స్టాపబుల్‌' విత్ ఎన్‌బీకేలో మంచు ఫ్యామిలీ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ, మంచు విష్ణు పాల్గొని అనేక విషయాలు షేర్ చేసుకున్నారు. ఇక మంచు విష్ణు మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు కూడా బాలకృష్ణ తనకు సపోర్ట్ చేశాడని మంచు విష్ణు వెల్లడించారు.

  English summary
  Mohan Babu praises Balakrishna's Akhanda movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X