పి.వాసు దర్శకత్వంలో మోహన్‌బాబు!
మోహన్‌బాబు గ్రహస్ధితి బాగుండనప్పుడల్లా ఆయన మిత్రుడు , దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రంగప్రవేశం చేసి ఆయనను ఆదుకోవడం మామూలే. గతంలో ఎన్నోసార్లు రజనీకాంత్ ఆయనకు ఆసరా ఇచ్చారు. ఇప్పుడు మోహన్‌బాబు కెరీర్ అంత బాగుండలేదు. ఆయన ఇద్దరు కొడుకుల పరిస్ధితి కూడా అంతే. అందువల్ల పి.వాసు దర్శకత్వంలో నటించాలని మోహన్‌బాబు ప్లాన్ చేసుకుంటున్నారు. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్‌కు చంద్రముఖి ద్వారా కొత్త బ్రేక్ ఇచ్చిన పి వాసు ఇప్పుడు విజయపథంలో కొనసాగుతున్నారు. ఆయన బాలకృష్ణ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా తర్వాత వాసు డేట్స్‌ను మోహన్‌బాబు తీసుకోనున్నట్టు, దీనికి రజనీకాంత్ సిఫార్సు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications