ఎన్టీఆర్ గా మోహన్ బాబు!
రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుల మధ్య సంఘర్షణను "రక్త చరిత్ర" సినిమాగా రామ్ గోపాల్ వర్మ తెరకు ఎక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ లో ఎన్టీఆర్ పాత్రకు వర్మ మోహన్ బాబును ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. హిందీ వెర్షన్ లో ఈ పాత్రను సర్గ్నా సిన్ హా పోషిస్తారు.
పరిటాల రవి పాత్రకు వివేక్ ఓబ్ రాయ్ ఎంపికయ్యారు. సినిమా కథ ప్రధానంగా పరిటాల రవికి, మద్దలచెరువు సూరికి మధ్య నడుస్తుంది. బ్యాక్ డ్రాప్ లో అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కన్పిస్తారు. ఫ్యాక్షన్ రెడ్లకు, ఇతర కులాలకు మధ్య సంఘర్షణను చిత్రీకరించాలని వర్మ భావిస్తున్నా రాయలసీమ రెడ్ల నుంచి వస్తున్న బెదిరింపుల కారణంగా ఆయన ఆ కోణాన్ని తప్పించి రెండు కుటుంబాల మధ్య జరిగిన రక్త చరిత్రకే పరిమితమవుతున్నట్టు తెలుస్తోంది. వర్మ ఇప్పటికే అనంతపురం జిల్లాలోని పరిటాల రవి, సూరి గ్రామాలను సందర్శించి స్ధానికులతో మాట్లాడి కథకు ముడి పదార్ధాన్ని సేకరించారు.


Click it and Unblock the Notifications











