విష్ణు బ్లడీ ఫెలోనా?
సంతోషమొచ్చినా, భాదొచ్చినా వెంటనే బయటపడే నటుడు మోహన్ బాబు. ఈ విషయం జరామస్తీ జరా ధూమ్ కార్యక్రమంలో మోహన్ బాబు ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. సొంత కొడుకు విష్ణును బ్లడీ ఫెలో అని అన్నారు. రమ్యకృష్ణ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ కార్యక్రమంలో అక్టోబర్ 14న గెస్ట్ లుగా మోహన్ బాబు, విష్ణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా విష్ణు మాట్లాడుతూ మోహన్ బాబు లాంటి తండ్రి ఉండడం అదృష్టం అయితే పొద్దున 4.45 గంటలకు లేవకపోతే ఆయనకు వచ్చే కోపం చూస్తే భాదేస్తుంది..మరికొద్దసేపు పడుకోవాలనిపిస్తుంది అనగానే మోహన్ బాబు బ్లడీ ఫెలో పొద్దున్నే లేవడం మంచి పద్ధతి. అలా లేసి తనపని తాను చేసుకోవడం మూలంగానే పద్మశ్రీ అవార్డు గెలుచుకునే స్థాయికి చేరుకున్నానని మోహన్ బాబు అన్నారు.


Click it and Unblock the Notifications











