మరో వివాదంలోమోహన్‌బాబు
సినీనటుడుమోహన్‌బాబు మరో వివాదంలోచిక్కుకున్నారు. సినీనిర్మాత నల్లమలుపుశీను అలియాస్ బుజ్జిపై ఇటీవలరామానాయుడు స్టూడియో వద్ద జరిగిన దాడిలోమోహన్‌బాబు పిఎ నిందితుడుగా పోలీసుల విచారణకు ఎదుర్కొంటున్నాడు. ఆదాడిజరిగిన రోజునే ఒక హీరో హస్తం ఉండిఉంటుందని పోలీసులు పత్రికలకుఉప్పందించారు. అది కో ప్రొడ్యూసర్ అయిననల్లమలుపు శీను మోహన్‌బాబు కుమారుడువిష్ణుతో ఒక సినిమా ప్రారంభించి వదిలేశారు. ఆ తర్వాతఆయన వెంకటేష్‌తో లక్ష్మి సినిమామొదలుపెట్టారు. దీనితో ఆగ్రహానికి గురైనమోహన్‌బాబు తన పిఎ ద్వారా ఆనిర్మాతపై దాడి చేయించినట్టు పోలీసులుఅనుమానిస్తున్నారు. దాడిలోప్రత్యక్షంగా పాల్గొన్నసాంబశివరావును పోలీసులు ఇంటరాగేట్ చేయగామోహన్‌బాబు పిఎ పార్ధసారధితనతో పాటు మరో ఏడుగురిని హైర్‌చేసుకున్నట్టు చెప్పాడు. అయితే పార్ధసారధి తన చెల్లెల్ని నిర్మాతనల్లమలుపు శీను వేధిస్తున్నాడని, అతనిమీద దాడి చేయమని తమను పురమాయించినట్టు సాంబచెప్పాడు. పోలీసులు విచారించగా పార్ధసారధికిచెల్లెలే లేదని తెలిసింది. దీనితో సినిమాఫక్కీలో మోహన్‌బాబు చుట్టూ కేసుఉబిగుసుకుంటోంది.


Click it and Unblock the Notifications











