ప్రతీకారం తీర్చుకున్న మోహన్ లాల్ ఫ్యాన్స్!
లాహోర్: మళయాలం స్టార్ మోహన్ లాల్ అఫీషియల్ వెబ్ సైట్ హ్యాకింగుకు గురైన సంగతి. పాకిస్థాన్ మద్దతుదారులైన కాశ్మీర్ వేర్పాటు వాదులు ఈ హ్యాకింగుకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ ప్రతీకార చర్యకు దిగారు. లాహోర్‌లోని నేషనల్ యూనివర్శిటీ వెబ్ సైట్‌ను హ్యాక్ చేసారు. యూనివర్శిటీ వెబ్ సైట్ హోం పేజీపై మోహన్ లాల్ సినిమా పోస్టర్లు పోస్టు చేసారు.
మంగళవారం...పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్స్ మోహన్ లాల్ వెబ్ సైట్ హ్యాక్ చేసి పాకిస్థాన్ జెండా, కాశ్మీర్ వేర్పాటు వాద స్లోగన్స్ పోస్టు చేసారు. సైబర్ వారియర్స్ గా పేర్కొంటున్న ఈ హ్యాకర్ల బృందం కాశ్మీర్ అంశంలో పాక్ వైఖరిని సమర్థిస్తూ మోహల్ లాల్ వెబ్ సైట్లో పోస్టులు పెట్టింది.

దీంతో ప్రతీకార చర్యగా మోహన్ లాల్ ఫ్యాన్స్ పాకిస్థాన్ యూనివర్శిటీ వెబ్ సైటుపై తమ ప్రతీకారం ప్రదర్శించారు. ఈ హ్యాకింగ్ విషయం సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











