»   » ఫస్ట్ లుక్స్ : మోహన్ లాల్ ‘మనమంతా’, 'జనతా గ్యారేజ్'

ఫస్ట్ లుక్స్ : మోహన్ లాల్ ‘మనమంతా’, 'జనతా గ్యారేజ్'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శనివారం మళయాళ సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా జనతా గ్యారేజ్ మళయాల టైటిల్ తో పాటు మోహన్ లాల్ లుక్ ను రివీల్ చేశారు. రఫ్ లుక్ లో డాన్ లా కనిపిస్తున్న మోహన్ లాల్ వెంట రఘు, బ్రహ్మాజీ, బెనర్జీ, అజయ్ లు నడిచి వస్తున్న పోస్టర్ కు మాలీవుడ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగుతో పాటు మళయాలంలోనూ ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.


ఇదే రోజున మోహన్ లాల్, గౌతమి ప్రధానపాత్రల్లో వారాహి చల‌న చిత్రం బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.6 నూతన చిత్రం 'మ‌నమంతా' ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు. 'ఐతే', 'అనుకోకుండా ఒకరోజు', 'ఒక్కడున్నాడు', 'ప్రయాణం', 'సాహసం' వంటి డిఫరెంట్ చిత్రాలను డైరెక్ట్ చేయడమే కాకుండా తొలి చిత్రం 'ఐతే'తో నేషనల్ అవార్డ్ దక్కించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.'ఈగ', 'అందాల రాక్షసి','లెజండ్', 'ఊహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్యా' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం 'ఈగ'తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.'One world four stories'...నాలుగు కథలు ఒకటే ప్రపంచం అంటూ మనకు మరో మంచి చిత్రాన్ని అందించబోతున్నారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఆ నాలుగు కథలు ఎలాంటి మలుపులు తీసుకుని ఏ ముగింపు చేరుకుందనేదే కథాంశం చాలా ఆసక్తికరంగా సాగుతుందని చిత్రయూనిట్ సభ్యులు తెలియజేశారు.


వేర్వేరు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నలుగురు భిన్నమైన వ్యక్తుల కథే ఈ చిత్రమని తెలియజేశారు.మోహన్ లాల్, గౌతమి, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అయ్యప్పశర్మ, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: చంద్రశేఖర్, ఆర్ట్: రవీందర్, కెమెరా: రాహుల్, మ్యూజిక్: మహేష్ శంకర్, నిర్మాత: రజనీ కొర్రపాటి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి.


English summary
While Mohanlal appearance in 'Janatha Garage' is massy, The Malayalam Superstar's intense look in 'Manamantha' directed by Chandrasekhar Yeleti stole the show. Sai Korrapati produces 'Manamantha' on Vaarahi Chalana Chitra banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu