twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదిరిందంతే : ఇన్నేళ్ల తర్వాత 'చంద్రముఖి'..ఒరిజనల్ చిత్రం ట్రైలర్ వచ్చింది (వీడియో)

    'మణిచిత్ర తాళు'... రిలీజైన ఇంతకాలానికి అంటే దాదాపు 23 సంవత్సరాల తర్వాత ట్రైలర్ ని విడుదల చేసారు.

    By Srikanya
    |

    కొచ్చి: రజనీకాంత్, నయనతార, జ్యోతిక కాంబినేషన్ లో పి.వాసు రూపొంది, ఘన విజయం సాధించిన చంద్రముఖి చిత్రం గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ చిత్రం ఓ రీమేక్ అని చాలా తక్కువ మందికి తెలుసు. ఆ చిత్రంకు మూలం..మళయాళ చిత్రం.. 'మణిచిత్ర తాళు'. ఈ చిత్రం గురించి చెప్పాలంటే... ఇప్పటివరకూ రిలీజ్ అయిన మళాయళ చిత్రాల్లో తప్పకుండా చూడాల్సిన టాప్ టెన్ లో ఈ సినిమా ఉండి తీరుతుంది.

    'మణిచిత్ర తాళు'...సైక్లాజికల్ ధ్రిల్లర్ సినిమా 1993 లో మళయాళంలో విడుదలై సంచలన విజయం సాధించింది. అయితే ఇప్పుడీ టాపిక్ ఎందుకు అంటే..ఈ సినిమా రిలీజైన ఇంతకాలానికి అంటే దాదాపు 23 సంవత్సరాల తర్వాత ట్రైలర్ ని విడుదల చేసారు. ఓ నెట్ జెన్ ఈ సినిమా మీద ఉన్న మమకారంతో ఈ ట్రైలర్ ని కట్ చేసి విడుదల చేస్తే ఓ రేంజిలో స్పందన వస్తోంది.

    అరుణ్ ఎడిట్జ్ అనే అతను కట్ చేసినట్లు చెప్పబడుతున్న ఈ ట్రైలర్ సోషల్ మీడియో ఓ పెద్ద సంచలనమే సృష్టిస్తోంది. ఆ సినిమా అభిమానలు మాత్రమే కాక, మోహన్ లాల్ అభిమానులు, సురేష్ గోపి అభిమానులు, పాజిల్ అభిమానులు, శోభన అభిమానులు ఈ ట్రైలర్ ని షేర్ చేస్తూ ముందుకు తీసుకువెల్తున్నారు. ఆ ట్రైలర్ ని మీరు క్రింద చూడవచ్చు.

    ఏడేళ్లు నలిగి..

    ఏడేళ్లు నలిగి..

    ఫాజిల్ దగ్గరకు ఈ స్క్రిప్టు వచ్చిన ఏడేళ్లు తర్వాత చూసాడు. ఆయన ఏదో విషయమై టేబులు వెతుకుతూంటే... బాగా అడుగున రైటర్ మధు ముట్టమ్ రాసిన స్క్రిప్ట్ కనబడింది. కాసేపు అటూ ఇటూ తిరగేశాడు. తర్వాత ఆ కథలో లీనమైపోయాడు. ఓ పెద్ద బంగ్లా... నాగవల్లి అనే దెయ్యం... ఓ సైకాలజిస్ట్ ట్రీట్‌మెంట్... భలే ఉందే కథ అనుకున్నాడు ఫాజిల్. మధుకి కబురు వెళ్లింది. వెంటనే ఫాజిల్ ఆఫీసులో వాలిపోయాడు మధు. అతనా స్క్రిప్ట్ రాసి ఏడేళ్లవుతోంది. అప్పట్లో ఫాజిల్‌కిస్తే 'ప్చ్' అన్నాడు.

    హై సక్సెస్

    హై సక్సెస్

    ఫాజిల్, మధు కలసి ఆ స్క్రిప్టుపై డిస్కషన్స్ మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేసారు. సినిమా స్టార్ట్. మలయాళ సూపర్‌స్టార్స్ మోహన్‌లాల్, సురేశ్ గోపీలు హీరోలు. నాగవల్లి ఆవహించే గంగ పాత్రలో శోభన. అదే 'మణిచిత్ర తాళు'. పెద్ద హిట్టైంది... బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. అవార్డులూ అంతే. శోభనకైతే బెస్ట్ యాక్ట్రెస్‌గా నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది.

    అక్కడా పెద్ద హిట్టే..

    అక్కడా పెద్ద హిట్టే..

    2004... బెంగళూరు... కన్నడ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్ ప్రెసిడెంట్. మీటింగ్ జరుగుతోంది. సీనియర్ కమెడియన్ ద్వారకేశ్‌కి, ఫైనాన్షియర్స్‌కి మధ్య గొడవ. ఈ వివాదాన్ని విష్ణువర్ధన్ డీల్ చేశాడు. ఫైనాన్షియర్లకి ద్వారకేశ్ అప్పు తీర్చేశాడు. ద్వారకేశ్‌కి విష్ణువర్ధన్ డేట్లు ఇచ్చాడు. డెరైక్టర్ పి.వాసుకి కబురెళ్లింది. ''నా ఫ్రెండ్ ఫాజిల్ పదేళ్ల క్రితం 'మణిచిత్ర తాళు' సినిమా చేశాడు. చాలా బావుంటుంది. మీకు కొత్తగా ఉంటుంది'' చెప్పాడు పి.వాసు. ''ఇంకేం... నేను రెడీ'' అన్నాడు విష్ణువర్ధన్. అదే 'ఆప్తమిత్ర'. సైకియాట్రిస్టుగా విష్ణువర్ధన్. నాగవల్లి ఆత్మ ఆవహించే గంగ పాత్రలో సౌందర్య. 2004... ఆగస్టు 27 రిలీజ్. బిగ్గెస్ట్ హిట్.

     ఆ రీమేక్ ని మళ్లీ రీమేక్ చేసి

    ఆ రీమేక్ ని మళ్లీ రీమేక్ చేసి

    గెటప్‌లో 'ఆప్తమిత్ర' రజనీ సినిమాకెళ్లాడు. ఆ సినిమా చూస్తూ... జనాల చప్పట్లు చూస్తూ... ఏదో ఆలోచిస్తున్నాడు. తనకు రైట్ టైమ్‌లో రైట్ సినిమా. పి.వాసుకి కాల్ చేశాడు. ప్రభుకి కూడా కాల్ చేశాడు. ''ఆప్తమిత్ర'ను మనం రీమేక్ చేస్తున్నాం'' చెప్పాడు రజనీ. 2005 ఏప్రిల్ 14. తెలుగు, తమిళ భాషల్లో 'చంద్రముఖి' చూసి ప్రేక్షకులకు దిమ్మ తిరిగిపోయింది. చెన్నైలో శివాజీ గణేశన్ సొంత థియేటర్ 'శాంతి'లో 804 రోజులాడి సౌత్ ఇండియా రికార్డ్ సృష్టించింది.

     చిరు చెయ్యాల్సింది.

    చిరు చెయ్యాల్సింది.

    రజినీ చేయడానికంటే ముందు తెలుగులో ఈ సినిమా చేయడానికి రెండు మూడు ప్రయత్నాలు జరిగాయట. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ ప్రతిపాదన వెళ్లిందట. మనసంతా నువ్వే నేనున్నాను చిత్రాల దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ సినిమా మలయాళ మాతృక ‘మణిచిత్ర తాళు' డీవీడీ పట్టుకెళ్లి చిరంజీవికి ఇచ్చి రీమేక్ చేద్దామన్నారట. కానీ చిరంజీవి ఆసక్తి చూపించలేదట. ఐతే చంద్రముఖి రిలీజయయ్యాక ఆ సినిమా సాధించిన విజయం చూసి.. చిరంజీవి వి.ఎన్.ఆదిత్యకు ఫోన్ చేసి నీ జడ్జిమెంట్ భేష్ అని చెప్పి ఆ సినిమా తాను చేయనందుకు విచారం వ్యక్తం చేశాడట.

    rnrnrn

    ఇదే ఇప్పుడు అంతటా

    ఇలా అంతటా హాట్ టాపిక్ గా మారి, భాక్సీఫీస్ కు కలెక్షన్స్ దెయ్యం పట్టించిన ఈ చిత్రం ఇన్నాళ్లకు ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ ఇధిగో..ఇక్కడ చూడండి..

    English summary
    When the psychological thriller hit the screens in 1993, the concept of releasing trailer and teaser before the official movie release was not a trend. Now, 23 years after the Mohanlal-starrer got released, a netizen, who goes with the name Arun Editz has come up with an impressive trailer for the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X