రూ. 600 కోట్ల బడ్జెట్: సూపర్‌స్టార్ లుక్ చూస్తే షాకే....(మోషన్ పోస్టర్)

మోహన్ లాల్ హీరోగా ‘ఓడియన్’ అనే సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ యువకుడిగా కనిపించబోతున్నారు.

By Bojja Kumar

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో 'జనతా గ్యారేజ్' తర్వాత ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే మన్యంపులి, కనుపాప ఇక్కడ మంచి విజయమే నమోదు చేశాయి.

త్వరలో మోహన్ లాల్ 'ఓడియన్' అనే మలయాళ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందకు రాబోతున్నారు. సోమవారం చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో మోహన్ లాల్ లుక్ చూసిన వారంతా షాకవుతున్నారు. ఇక ఆయన అభిమానులైతే ఆయన లుక్ కిరాక్‌గా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.

60 ఏళ్ల సూపర్ స్టార్ యువకుడిలా...

60 ఏళ్ల సూపర్ స్టార్ యువకుడిలా...

ప్రస్తుతం మోహన్ లాల్ వయసు 57 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ వయసుకు తగిన విధంగానే ఉన్నాయి. అయితే ఈ చిత్రంలోని ఓ పాత్రలో మోహన్ లాల్ యువకుడిలా కనిపించబోతున్నారని తెలుస్తోంది. అందుకు తగిన విధంగానే ఆయన్ను సూపర్బ్‌గా మేకోవర్ చేశారు.

పీటర్ హెయిన్స్

మోహన్ లాల్ నటించిన ‘మన్యంపులి' చిత్రానికి అద్బుతమైన స్టంట్స్ కంపోజ్ చేసిన పీటర్ హెయిన్స్ ‘ఓడియన్' చిత్రానికి కూడా పని చేస్తున్నారు. ఆయన తన ట్విట్టర్ పేజీ ద్వారా ఈ చిత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

శ్రీకుమార్ దర్శకత్వం

శ్రీకుమార్ దర్శకత్వం

‘ఓడియన్' చిత్రానికి విఎ శ్రీకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ ఓడియన్ మానిక్యన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

రూ. 600 కోట్ల బడ్జెట్

రూ. 600 కోట్ల బడ్జెట్

‘ఓడియన్' చిత్రాన్ని రూ. 600 బడ్జెట్‌తో ఆంటోనీ పెరంబవూర్ నిర్మిస్తున్నారు. ఇదో ఫాంటసీ సబ్జెక్టుతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు ఏ చిత్రానికి ఇంత పెద్ద బడ్జెట్ ఖర్చు పెట్టలేదు. మళయాలంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇంత బడ్జెట్ తో సినిమా అంటే ఏ స్థాయిలో ఉంటుందో?

రూ. 1000 కోట్ల మహాభారతం ఇప్పుడు లేనట్లేనా?

రూ. 1000 కోట్ల మహాభారతం ఇప్పుడు లేనట్లేనా?

విఎ శ్రీకుమార్ కొన్ని రోజుల క్రితం రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో మోహన్ లాల్ హీరోగా ‘మహాభారతం' సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మధ్యలో ‘ఓడియన్' ప్రాజెక్టు మొదలు పెట్టడంతో ‘మహాభారతం' మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X