సాంగ్ రిలీజ్ ...డిస్ట్రిబ్యూటర్స్ , బయ్యర్లు నుంచి నిర్మాతకు ఫోన్స్ , అంత క్రేజా?

మోహ‌న్‌లాల్ మరో హిట్ ఒప్పం సినిమాని క‌నుపాప‌ పేరుతో డబ్బింగ్ చేసేస్తున్నారు. ఈ చిత్రానికి సంభదించిన పాట రిలీజైంది.

By Srikanya

హైదరాబాద్: అన్నం మొత్తం చూడక్కర్లేదు..ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అని సామెత. ఇప్పుడు మోహన్ లాల్ హీరోగా నటించగా హిట్టై, తెలుగులో డబ్బింగ్ గా వస్తున్న కనుపాప చిత్రం పరిస్దితి బిజినెస్ పరిస్దితి అలాగే ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం పిభ్రవరి 3 వ తేదీన విడుదల అవటానికి సిద్దంగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన పాటను రిలీజ్ చేసారు. ఆ పాట యూట్యూబ్ లో విడుదల కాగానే...డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ పాట మీరు విన్నారా...వినకపోతే ఇక్కడ వినండి.

ఒప్పం క‌థ విష‌యానికి వ‌స్తే....ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ అంధుడిగా న‌టించారు. అంధుడైన‌ మోహ‌న్ లాల్ ఓ అపార్టెమెంట్ లో లిఫ్ట్ ఆప‌రేట‌ర్ గా వ‌ర్క్ చేస్తుంటాడు. ఒక రోజు ఆ అపార్ట్ మెంట్ లో మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంది. ఆ మ‌ర్డ‌ర్ చేసిన కిల్ల‌ర్ త‌ప్పించుకుంటాడు. అయితే....మ‌ర్డ‌ర్ చేసిన కిల్ల‌ర్ ను అంధుడైన‌ మోహ‌న్ లాల్ ఎలా ప‌ట్టుకున్నాడు అనేది ఒప్ప‌మ్ క‌థ‌.

ఎన్టీఆర్ తో చేసిన జనతా గ్యారేజ్, యేలేటి 'మనమంతా', రీసెంట్ గా విడుదలైన 'మన్యం పులి' (పులి మురగన్ డబ్బింగ్ )చిత్రాలతో లాల్ హ‌వా మ‌ళ్లీ టాలీవుడ్‌లో మొద‌లైంది. చాలా గ్యాప్ త‌ర్వాత ఒకే ఏడాదిలో మూడు సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డం అంటే గ్రేట్. ప్ర‌స్తుతం ఇదే పాజిటివ్ టాక్ మోహ‌న్‌లాల్‌కి బాగా క‌లిసొస్తోంది. ఈ హుషారులోనే .. లాల్ న‌టించిన సినిమాల‌న్నీ టాలీవుడ్‌లో క్యూ క‌ట్టేస్తున్నాయి.

 Mohanlal's Oppam dubbing Song released

దాంతో ఇప్పుడు టాలీవుడ్ లో మోహన్ లాల్ హవా ప్రారంభమైంది. ఊహించని విధంగా ఆయన క్రేజ్ ఇక్కడ స్టార్టైంది. ఆయన సినిమాలకు ట్రేడ్ సర్కిల్స్ లో డిమాండ్ ఏర్పడింది. ఆయన సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. మినిమం గ్యారెంటీగా సినిమా ఉంటుందని నమ్మి మోహన్ లాల్ బ్రాండ్ పై డబ్బు పెట్టడానికి సిద్దపడుతున్నారు.

అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం ఏఎన్నార్, బాలకృష్ణల 'గాడీవం' చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన ఆయన మళ్ళీ ఈ 2106 లోనే తెలుగు ప్రేక్షకులకు దర్శనమిచ్చాడు. తెలుగు వాళ్ళు కూడా ఆయన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు. 'జనతా గ్యారేజ్' చిత్రంలో ఆయన పాత్రకు మంచి ఆదరణ దక్కగా ఆయన సోలోగా చేసిన 'మనమంతా', రీసెంట్ గా విడుదలైన 'మన్యం పులి' చిత్రాలు మంచి సినిమాలనే టాక్ తెచ్చుకుని డబ్బులు తెచ్చిపెడుతున్నాయి.

ఆ స్పీడులో మోహ‌న్‌లాల్ న‌టించి మ‌ల‌యాళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఒప్పం సినిమాని క‌నుపాప‌ పేరుతో తెలుగైజ్ చేసేస్తున్నారు. ఓ పాప‌, చూపులేని వ్య‌క్తి, ఓ హ‌త్య కేసు చుట్టూ ఇంట్రెస్టింగ్ ట్విస్టుల‌తో సాగే ఈ సినిమా తెలుగువారిని మెప్పిస్తుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఈ చిత్రానికి బిజినెస్ సర్కిల్ లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యిందని సమాచారం.

ఇప్పటికే ఈ సినిమాకు సంభందించి క్రేజీ ఆఫర్స్ తో డిస్ట్రిబ్యూటర్స్ సందడి చేస్తున్నట్లు ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ముఖ్యంగా ఒప్పం చిత్రం మళయాళంలో ఘన విజయం సాధించటం, ప్రియదర్శన్ కాంబినేషన్ కావటం, మోహన్ లాల్ నటన, సినిమా లో పాప సెంటిమెంట్ , యాక్షన్ ఎపిసోడ్స్ , ధ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాపై ఇంట్రస్ట్ ని పెంచేస్తున్నాయి. తెలుగులో ఒప్పం డబ్బింగ్ వెర్షన్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

మోహన్ లాల్ , సముతిరాకని, అనుశ్రీ, విమలారామన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఒప్పం'. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొంది రిలీజైన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 8న విడుదలైన ఈ చిత్రం మొదటి 15 రోజుల్లోనే 23.7 కోట్లు గ్రాస్ వసూలు చేసి , మళయాళ సూపర్ హిట్ మూవి ప్రేమమ్ రికార్డ్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్టైన్మెంట్స్ బి.దిలీప్ కుమార్ తో కలిసి మోహన్ లాల్ ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X