భూమిక మెచ్చిన హీరో
యాక్షన్ చెప్పగానే ఆయన..కెమెరా ముందు లీనమయ్యే తీరు చూస్తూంటే..సర్వం మర్చిపోయానని మోహన్ లాల్ గురించి చెప్పుకొచ్చింది భూమిక. అలాగే ఆయన నటన చూసి షాకయ్యానని, తాను చాలా నేర్చుకోవాల్సి ఉందనిపించిందని, తన కెరీర్ లో తాను చూసిన వారిలో బెస్ట్ ఫెరఫార్మెన్స్ ఇచ్చిన నటుడు అతడేనని మోహన్ లాల్ గురించి మళయాళ మీడియాతో మాట్లాడింది భూమిక. భ్రమరం పేరుతో రెడీ అవుతున్న మళయాళ చిత్రంలో భూమిక..మోహన్ లాల్ సరసన నటిస్తోంది.
అందులో భూమిక ఆ హీరో భార్యగా న్యాచురల్ గా మళయాళి సంప్రదాయ దుస్తులలో కనిపించనుంది. ఇక భూమిక నటించిన మరో చిత్రం నా స్టైలే వేరు త్వరలో రిలీజ్ కానుంది. చిరునవ్వుతో ఫేమ్ జి.రామ్ ప్రసాద్ డైరక్ట్ చేసిన ఈ చిత్రంలో రాజశేఖర్ హీరోగా చేసారు. అనసూయ అనంతరం భూమిక చేస్తున్న చిత్రం ఇది. అలాగే ఆమె తన స్వంత నిర్మాత సంస్ధ డౌన్ టౌన్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై తకిట..తకిట అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. అందులో అనూష్క చేస్తోంది..శ్రీహరి నాను డైరక్ట్ చేస్తున్నారు. శ్రీహరి నాను గతంలో సత్యభామ చిత్రానికి దర్శకత్వం చేసారు. అలాగే భ్రమరం చిత్రం తెలుగులోనూ డబ్బింగ్ అయి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











