Don't Miss!
- News సీఎం జగన్ కాన్యాయ్లోకి దూసుకొచ్చిన యువకుడు
- Sports IPL 2024: ఆర్సీబీ కొంపముంచుతున్న ఫాఫ్ డుప్లెసిస్ చెత్త కెప్టెన్సీ!
- Lifestyle మరణించిన తరువాత జరిగేది అదేనా.. సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోతోంది..
- Automobiles ఈ కార్లు సేఫ్టీలో జీరో.. సేల్స్‌లో టాప్.. అయినా జనాలు వీటినే ఎందుకు కొంటున్నారు?
- Technology వాట్సాప్‌లో Recently Online ఫీచర్.. ఎమర్జెన్సీ సమయంలో ఎలా పనిచేస్తుంది..?
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
పెళ్లి వేడుకలో శ్రీదేవి, ఖుషి, మహేష్ హీరోయిన్ కైరా అడ్వాని సందడి (ఫోటోస్)
బాలీవుడ్ హీరో మోహిత్ మార్వా పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. మోహిత్ తన ప్రియురాలు ఆంత్ర మోతివాలను పెళ్లాడ బోతున్నారు. ఆల్రెడీ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ యూఏఈలో ప్రారంభం అయ్యాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు అర్జున్ కపూర్, మనీష్ మల్హోత్రా, సిద్ధాంత్ కపూర్, రియా కపూర్, శ్రీదేవి, ఖుషి కపూర్, కైరా అడ్వాని తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. వీరితో పాటు బోనీ కపూర్, హర్షవర్దన్, సోనమ్ కపూర్ అటెండ్ అయ్యారు.
మోహిత్ మార్వా-ఆంత్ర మోతీవాలా
మోహిత్ మార్వా-ఆంత్ర మోతీవాలా పెళ్లి వేడుక ఫిబ్రవరి 21, 2018న యూఏఈలో జరుగబోతోంది. పెళ్లి వేడుక ముందు జరిగే ప్రీ వెడ్డింగ్ బాష్‌లో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు.
బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్
యూఏఈలోని ఆల్ రాస్ ఖైమా అనే ప్రాంతంలో మోహిత్-ఆంత్ర వివాహ వేడుక జరుగుతోంది. వేడుకలో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులు, బాలీవుడ్ ప్రముఖులు, స్నేహితులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.
అర్జున్ కపూర్
పెళ్లి వేడుకలో భాగంగా జరిగిన మెహందీ సెర్మనీలో అర్జున్ కపూర్ హైలెట్ అయ్యాడు. ఈ వేడుకలో ఫన్ క్రియేట్ చేయడంతో పాటు డాన్స్ చేస్తూ సందడి చేశాడు.
సంజయ్ కపూర్ కూతురుతో కలసి
బాలీవుడ్ యాక్టర్ సంజయ్ కపూర్ తన కూతురు శానయా కపూర్‌తో కలిసి మోహిత్-ఆంత్ర ప్రీ వెడ్డింగ్ బాష్‌లో పాల్గొన్నారు.
శ్రీదేవి-ఖుషి
ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్న ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తనకు అత్యంత సన్నిహితులైన శ్రీదేవి, ఖుషి కపూర్‌తో కలిసి ఇలా సెల్ఫీ.
మహేష్ బాబు హీరోయిన్ కైరా అడ్వానీ
ఈ పెళ్లి వేడుకలో హీరోయిన్ కైరా అడ్వానీ కూడా పాల్గొన్నారు. ఆమె మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్ ధరించి ఎంతో అందంగా కనిపించారు. ఈ బ్యూటీ మహేష్ బాబు భరత్ అను నేను చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఖుషి కపూర్
మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్సులో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్. ఈ లుక్‌లో ఖషి కపూర్‌ను చూసి అంతా ఫిదా అవుతున్నారు.
మనీష్ మల్హోత్రా
ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్న ప్రముఖ సెలబ్రిటీలంతా కూడా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులే ధరించడం గమనార్హం.
మోహిత్-ఆంత్ర రిలేషన్
మోహిత్ మార్వా, ఆంత్ర మోతీవాలా చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఇద్దరూ ఎట్టకేలకు వివాహంతో ఏకం కాబోతున్నారు.
వెడ్డింగ్ డే
ఫిబ్రవరి 21, 2018న యూఏఈలో ఈ జంట వివాహం గ్రాండ్‌గా జరుగబోతోంది.
రియా కపూర్
ఎల్లో కలర్ డ్రెస్సులో సూపర్ కూల్ లుక్ తో రియా కపూర్.