మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశాన్ని కన్‌ఫర్మ్ చేసిన బాలకృష్ణ
హైదరాబాద్: తన నట వారసుడిగా మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశాన్ని బాలకృష్ణ మరోసారి కన్ ఫర్మ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో జాతీయ జెండా ఎగురవేసిన బాలయ్య మీడియాతో మాట్లాడుతూ...మరో రెండు మూడు సంవత్సరాల్లో మోక్షజ్ఞను హీరోగా వెండి తెరకు పరిచయం చేయనున్నట్లు తెలిపారు.
కాగా...బాలయ్య సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం 2014లో మోక్షజ్ఞ నటించబోయే సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. అంతకంటే ముందుగా మోక్షజ్ఞను లండన్ పంపించి అక్కడ మార్షల్ ఆర్ట్స్, డాన్స్, యాక్టింగులో ట్రైనింగ్ ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారట బాలయ్య.
చిరంజీవి తన రాజకీయ రంగ ప్రవేశానికి కొద్ది రోజుల ముందు తన తనయుడు రామ్ చరణ్ తేజను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇప్పుడు బాలకృష్ణ కూడా అదే దారిలో నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల శ్రీమన్నారయణ చిత్ర ఆడియో విడుదలకు బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞను తోడ్కొని వచ్చారు. బాలయ్య ఏ సినిమా ఫంక్షన్‌కు తనయుడిని వెంట బెట్టుకు రాలేదు.
ఇప్పుడు మోక్షజ్ఞతో రావడంతో ఆయన రాజకీయ ఆరంగేట్రం సాధ్యమైనంత త్వరగా ఉంటుందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. బాలయ్య 2014 ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో సినీ రంగానికి తన వారసుడు ఉండాలని బాలయ్య భావించి ఉంటారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











