For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ కు పోటీ?: మోక్షజ్ఞ లేటెస్ట్ ఫొటోలు చూసి చెప్పండి

  By Srikanya
  |

  హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ గా వినిపిస్తున్న న్యూస్ ఏమైనా ఉందంటే అది నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ తెరంగ్రేటం గురించే. ఈ విషయమై రకరకాల వార్తలు, రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.

  అయితే తన కుమారుడు మోక్షజ్ఞ తెరంగ్రేటంపై నందమూరి బాలకృష్ణ స్పష్టతనిచ్చారు. ఆదిత్య 369 సీక్వెల్‌ చిత్రంలో తాను, మోక్షజ్ఞ కలిసి నటిస్తామని చెప్పారు. అయితే ఆ చిత్రానికి ఇంకా సమయం ఉందన్నారు.

  ఈ నేపధ్యంలో నందమూరి వారసుడు ప్రస్తుతం సూపర్ సక్సెస్ లో ఉన్న ఎన్టీఆర్ కు పోటీ ఇస్తాడా అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బాలకృష్ణ సీనియర్ హీరో, ఎన్టీఆర్ జూనియర్..దాంతో వీరు వేసే పాత్రలు వేరు వేరు..పోటీ లేదు. కానీ ఖచ్చితంగా ఎన్టీఆర్ కు ,మోక్షజ్ఞ కు మధ్య పోటీ ఉంటుందని ట్రేడ్ లో విశ్లేషణలతో కూడిన చర్చలు వినిపిస్తున్నాయి.

  Also Read: ఎన్టీఆర్ బాధపడుతున్నాడట..కారణాలు ఇవే

  పూర్తి వివరాల్లోకి వెళితే..బాలకృష్ణ కోసం సింగీతం శ్రీనివాసరావు 'ఆదిత్య 999' అనే మరో కథను కొద్ది కాలం క్రితమే సిద్ధం చేశారు. ఈ చిత్రంలో మోక్షజ్ఞ కూడా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని బాలకృష్ణ ధ్రువీకరించారు. ''ఆదిత్య 999'లో మోక్షజ్ఞ నటిస్తాడు. అయితే ఆ సినిమాకి కొంత సమయం ఉంది''అని చెప్పి నందమూరి అభిమానులను ఆనందపరిచారు.

  మరో ప్రక్క మోక్షజ్ఞ గత కొద్ది రోజులుగా తన డిక్షన్ మెరుగుపరుచుకుంటూ, డైలీ జిమ్ కు వెళ్తూ తన బాడిని ఫిట్ గా చేసుకుంటున్నారు. ఈ మధ్యనే యుఎస్ లో ఈ కుర్రాడు ..ఓ పేరున్న యూనివర్శిటీలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. అంతేకాదు అక్కడే డాన్స్, ఫైట్స్ కు సంభందించిన శిక్షణ కూడా పూర్తి చేసాడు.

  స్లైడ్ షోలో రేర్ ఫొటోలు, మరిన్ని విశేషాలతో ...

  మూడో తరం

  మూడో తరం

  నందమూరి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని మూడో తరంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన హీరోనే మోక్షజ్ఞ.

  సోలో ఎంట్రీ కాకుండా..

  సోలో ఎంట్రీ కాకుండా..

  మోక్షజ్ఞ ఎంట్రి సోలోగా కాకుండా, తండ్రితోపాటు ఇస్తే బాగుంటుందనేది బాలయ్య అభిప్రాయం.

  అందుకే

  అందుకే

  అందుకే మోక్షజ్ఞ ఎంట్రికి తన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అయిన ఆదిత్య 999 అయితే అన్ని విధాలుగా బాగుంటుందని బాలయ్య అభిప్రాయంగా తెలుస్తుంది.

  కనెక్ట్ అయ్యే కథతో ..

  కనెక్ట్ అయ్యే కథతో ..

  "మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. మహిళలకు, సాధారణ ప్రేక్షకులకూ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడు.

  రెండు ఆప్షన్స్..

  రెండు ఆప్షన్స్..

  ప్రస్తుతం నా వందో సినిమాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బోయపాటి సినిమా అయితే ఇంకోటి 'ఆదిత్య 369'కి సీక్వెల్ అయిన 'ఆదిత్య 999'. ఈ రెండిట్లో 'ఆదిత్య 999' ముందు సెట్స్‌ పైకి వెళితే అదే మోక్షజ్ఞ మొదటి సినిమా కూడా అవుతుంది.

  అదే తొలి సినిమా

  అదే తొలి సినిమా


  'ఆదిత్య 999' సినిమాలోని రెండు పాత్రల్లో ఒకటి మోక్షజ్ఞే చెయ్యాలి. మోక్షజ్ఞ మొదటి సినిమాలో నేను కూడా ఉంటాను." అని తెలిపారు.

  ఇదే రైట్ టైమ్

  ఇదే రైట్ టైమ్

  వరస హిట్స్ తో ప్రస్తుతం బాలయ్య ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. సరిగ్గా ఈ సమయంలో తనయుడు మోక్షజ్ఞ ఎంట్రి జరిగితే అన్ని విధాలుగా బాగుంటుందని బాలయ్య అభిప్రాయ పడుతున్నాడు.

  యువరాజుగా..

  యువరాజుగా..

  బాలయ్య సినిమాలోనే యువరాజు పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా మోక్షజ్ఞ ఓ సైంటిస్టు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

  రూమరా

  రూమరా

  టైం మెషిన్‌కు సంబంధించిన చిక్కుముడిని విప్పే ఓ గణిత మేథావి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నాడని తెలిసింది.

  పది నిముషాలే...,.

  పది నిముషాలే...,.


  ఈ పాత్రలో మోక్షజ్ఞ కేవలం 10 నిముషాలు మాత్రమే కనిపిస్తాడని చెబుతున్నారు.

  అఖిల్ లా కాకుండా

  అఖిల్ లా కాకుండా

  అఖిల్ లాంచింగ్ కు జరిగిన తప్పు తన కుమారుడు విషయంలో జరగకూడదని బాలయ్య భావిస్తున్నాడు

  అలాంటివి వద్దు

  అలాంటివి వద్దు

  నా కొడుకు తొలి సినిమాకే ప్రపంచాన్ని కాపాడేసాడు లాంటి పాత్రలు వద్దు అని బాలయ్య కామెంట్ చేసారు. ఇటీవల విడుదలై అఖిల్ సినిమాను ఉద్దేశించే అని అంటున్నారంతా.

  నిర్మాత

  నిర్మాత

  బాలయ్య వందో సినిమాను 'లెజెండ్' సినిమా తీసిన 14 రీల్స్ - వారాహి చలనచిత్రం బేనర్లు సంయుక్తంగా నిర్మిస్తాయని సాయి కొర్రపాటి ఇటీవల వెల్లడించారు.

  పూర్తి స్దాయి సినిమా

  పూర్తి స్దాయి సినిమా


  మోక్షజ్ఞ తొలి సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చేలా ఉండాలని బాలయ్య కోరుకుంటున్నారు. అలాంటి కథల కోసమే ఎదురు చూస్తున్నారు.

  అసలు ఐడియా

  అసలు ఐడియా

  మోక్షజ్ఞ యాక్టింగ్ స్కిల్స్ కు ట్రైల్ లాంటి సినిమా అదీ సీనియర్ దర్శకుడుతో చేయించాలని బాలయ్య ప్లాన్ అందుకే ఆదిత్యా 999 ఓకే చేసాడంటున్నారు

  భారీ ఆర్బాటాలు వద్దు

  భారీ ఆర్బాటాలు వద్దు

  మోక్షజ్ఞ తొలి సినిమా విషయంలో భారీ ఆర్భాటాలకు పోవాలని అనుకోవడం లేదు. ప్రారంభంలో సినిమాలు మామూలుగానే.... వీడు మనబ్బాయి అనే విధంగా ప్రేక్షకులు ఫీలయ్యేలా ఉండాలి అన్నారు బాలయ్య.

  అదే వస్తుంది

  అదే వస్తుంది

  ముందు మామూలు సినిమాలతో ప్రేక్షకుల అభిమానం చూరగొంటే...మాస్ ఫాలోయింగ్ అదే వస్తుంది అన్నారు బాలయ్య

  నిర్ణయం తీసుకోలేదు

  నిర్ణయం తీసుకోలేదు


  సింగితం శ్రీనివాస్ గారు ‘ఆదిత్య 369' సీక్వెల్ కథతో సహా సిద్ధంగా ఉన్న మాట నిజమే. అయితే ఈ సినిమా విషయంలో నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

  స్పెషల్ ట్రైనింగ్

  స్పెషల్ ట్రైనింగ్

  మోక్షజ్ఞను సినిమాలకు తగిన విధంగా లుక్, బాడీ లాంగ్వేజ్ ఉండేలా ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్లు సమాచారం.

  వరసపెట్టి ..

  వరసపెట్టి ..

  ప్రస్తుతం మోక్షజ్ఞ తన తాతయ్య ఎన్టీఆర్ కు సంబంధించిన సినిమాలు వరుస పెట్టి చూస్తున్నాడట.

  తనకంటూ...

  తనకంటూ...

  తాతయ్య బాడీ లాంగ్వేజ్ అనుకరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మ్యానరిజం, స్టైల్ క్రియేట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడట.

  అభిమానులు ఇలా..

  అభిమానులు ఇలా..


  మోక్షజ్ఞ తొలి సినిమా తెలుగులో టాప్ మాస్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న రాజమౌళి, బోయపాటి, వినాయక్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అయితే బాగుంటుందని అభిమానుల ఆలోచన

  టైటిల్

  టైటిల్

  సాయి కొర్రపాటి మాట్లాడుతూ...బాలకృష్ణ గారు నాకు ఇష్టమైన వ్యక్తి. వాళ్లబ్బాయి మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలనేది నా కోరిక. అందుకోసం 'రానే వచ్చాడయ్యా ఆ రామయ్యా' అన్న టైటిల్‌ నమోదు చేశాను కూడా.

  యంగ్ లయిన్

  యంగ్ లయిన్

  బాలయ్యకు ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో 'నందమూరి నట సింహం' అనే పేరు ఉంది. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞకు 'యంగ్ లయన్' అనే ట్యాగ్ తగిలించారు.

  పోస్టర్లు సైతం...

  పోస్టర్లు సైతం...

  ఆ మధ్య పుట్టినరోజును పురస్కరించుకుని 'యంగ్ లయన్' మోక్షజ్ఞ అంటూ పోస్టర్లు వెలిసాయి.

  యంగ్ టైగర్

  యంగ్ టైగర్

  మరో వైపు నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే 'యంగ్ టైగర్' ట్యాగ్‌తో జూ ఎన్టీఆర్ బాగా పాపులర్ అయిన సంగతి.

  ఎదురుచూస్తున్నారు

  ఎదురుచూస్తున్నారు

  మరి యంగ్ లయన్‌గా రాబోతున్న మోక్షజ్ఞ ఇండస్ట్రీలో...తండ్రి పేరును ఎలా నిలబెడతాడో చూడాలి.

   బోయపాటి ఏమన్నాంటే...

  బోయపాటి ఏమన్నాంటే...

  మోక్షజ్ఞని తెరకు పరిచయం చేసే బాధ్యతని కూడా బాలయ్య నాకే అప్పగించారని బయట ప్రచారం సాగుతోంది. మోక్షజ్ఞ తెరపైకి రావడానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది.

  అప్పట్లో..

  అప్పట్లో..

  తన కుమారుడు మోక్షజ్ఞ ప్రస్తుతం బీబీఎం చదువుతున్నాడని, చదువు పూర్తయ్యాక అతడి ఆసక్తిని బట్టి భవిష్యత్తు నిర్ణయమవుతుందని బాలకృష్ణ చెప్పారు.

  ఈ లోగా

  ఈ లోగా

  లండన్ పంపించి అక్కడ మార్షల్ ఆర్ట్స్, డాన్స్, యాక్టింగులో ట్రైనింగ్ ఇప్పించేందుకు బాలయ్య సన్నాహాలు చేస్తున్నారనే టాక్ వచ్చింది

  English summary
  Mokshagna is vesting his time to improve his diction and prepping himself up for the launch, by hitting the gym. The lad recently completed his bachelors degree from a renowned university in USA and has also received a little training in fights and dancing. Here are a few latest pictures of Mokshagna, in the slides.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X