గుడ్ న్యూస్: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో ఫిక్స్ చేసారు

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ నటుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలో హీరోగా రంగ ప్రవేశం చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోక్షజ్ఞ ఓ వైపు చదువు కొనసాగిస్తూనే, మరో వైపు సినీ రంగ ప్రవేశానికి కావాల్సిన నటన, డాన్స్, ఫైట్స్ లాంటి విద్యల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం....మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడనేది ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ దిన పత్రిలో వచ్చిన వార్తల ప్రకారం.... బాలయ్య 100వ సినిమా పూర్తయిన తర్వాత 2016లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. బాలయ్య కూడా పలు సందర్భాల్లో మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని చెప్పుకొచ్చారు.

Mokshagna will make a grand debut in 2016

మోక్షజ్ఞను హీరోగా నిలబెట్టడానికి బాలయ్య తెర వెనక ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కథలు కూడా విన్నట్లు తెలుస్తోంది. బాలయ్యతో ‘లెజెండ్' చిత్రాన్ని తెరకెక్కించిన సాయి కొర్రపాటి మోక్షజ్ఞ సినిమాను నిర్మించబోతన్నారని సమాచారం.

ఆ మధ్య సాయి కొర్రపాటి మాట్లాడుతూ...బాలకృష్ణ గారు నాకు ఇష్టమైన వ్యక్తి. వాళ్లబ్బాయి మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలనేది నా కోరిక. అందుకోసం 'రానే వచ్చాడయ్యా ఆ రామయ్యా' అన్న టైటిల్‌ నమోదు చేశాను కూడా. మిగతా విషయాలు బాలయ్యే చెబుతారు. టీవీలో పాటల్ని బాగా వింటాను. అందులో సినిమా టైటిల్స్‌గా పెట్టుకునే మాటలు వస్తాయేమోనని పరిశీలిస్తాను. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోని పాట నుంచి తీసుకున్నదే 'రానే వచ్చాడయ్యా ఆ రామయ్యా' అన్నారు ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X