తీవ్ర శోకంలో పాక్ యువ నటి.. శ్రీదేవి మృతితో రెండవ షాక్!

శ్రీదేవి మృతితో అతిలోక సుందరిని కోల్పోయాం అని చిత్ర పరిశ్రమ సోకిస్తోంది. కానీ పాకిస్థానీ యువ నటి సజల్ అలీ మాత్రం తాను రెండవ సారి అమ్మని కోల్పోయానని తీవ్ర శోకంలో మునిగిపోయింది. సజల్ అలీ ఎవరో కాదు.. శ్రీదేవి చివరి చిత్రం మామ్ లో ఆమెకు కుమార్తెగా నటించింది సజల్ ఆలీనే. తక్కువ సమయంలో సజల్ అలికి ఇది రెండవ దిగ్బ్రాంతి ఘటన. తనకు ఎగిరిన వరుస రెండు చేదు అనుభవాలతో సజల్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Recommended Video

శ్రీదేవి మరణంపై.. టాలీవుడ్ ప్రముఖుల దిగ్బ్రాంతి !
అతిలోక సుందరి చివరి చిత్రం అదే

అతిలోక సుందరి చివరి చిత్రం అదే

శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాక ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంలో నటించింది. వయసు పెరిగినా తన సత్తా తగ్గదని శ్రీదేవి ఆ చిత్రంతో నిరూపించింది. గత ఏడాది శ్రీదేవి మామ్ అనే మరో చిత్రంలో నటించింది.

తల్లి కూతుళ్ళ సెంటిమెంట్

తల్లి కూతుళ్ళ సెంటిమెంట్

తల్లి కూతుళ్ళ సెంటిమెంట్ తో మామ్ చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో బాధ్యతగల తల్లిగా, కూతురుకి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే అమ్మగా శ్రీదేవి మెప్పించింది. ఈ చిత్రంలో శ్రీదేవి కుమార్తెగా పాక్ యువ నటి సజల్ అలీ నటించడం విశేషం.

ఆ సమయంలో సజల్ కు షాక్

ఆ సమయంలో సజల్ కు షాక్

మామ్ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో సజల్ తల్లి మరణించింది. తల్లి మరణంతో కుంగిపోయిన సజల్ కు శ్రీదేవి ఓదార్పు నిచ్చినట్లు తెలుస్తోంది.

శ్రీదేవి మృతితో తీవ్ర శోకంలోకి

శ్రీదేవి మృతితో తీవ్ర శోకంలోకి

తనకు తల్లిగా నటించిన శ్రీదేవి మరణముతో మరోమారు తాను తల్లిని కోల్పోయానని సజల్ అలీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ వార్త తనని దిగ్బ్రాంతికి గురిచేసినట్లు సజల్ వెల్లడించింది.

బాగా దగ్గరయ్యారు

బాగా దగ్గరయ్యారు

షూటింగ్ సమయంలో శ్రీదేవి తనకు బాగా దగ్గరయ్యారని సజల్ వివరించింది. మిగిలిన నటులతో తాను కలసి పోవడానికి చాలా సమయం పట్టింది. కానీ శ్రీదేవితో మాత్రం తనని దగ్గరకు తీసుకున్నారని ఈ పాకిస్థానీ యువ నటి వెల్లడించడం విశేషం.

భవోద్వేగానికి లోనైన శ్రీదేవి

భవోద్వేగానికి లోనైన శ్రీదేవి

మామ్ చిత్ర ప్రచార సమయంలో సజల్ తల్లి మరణాన్ని శ్రీదేవి గుర్తు చేసుకున్నారు. ఆమె భావోద్వేగానికి లోనయ్యారు కూడా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X