బాహుబలితో ఇబ్బంది: నో కామెంట్ అంటూ శ్రీదేవి ఎస్కేప్!

తన తాజా సినిమా మామ్ మూవీ ప్రమోషన్లో పాల్గొంటున్న శ్రీదేవికి బాహుబలి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

By Bojja Kumar

హైదరాబాద్: ఇండియన్ సినీ చరిత్రలో అద్భుతం 'బాహుబలి'. ఇలాంటి అద్భుతమైన సినిమాలో తమకు అవకాశం రాలేదే అని బాధపడిన స్టార్స్ ఎందరో. కానీ తనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని తనే కాదనుకుంది శ్రీదేవి. బాహుషా అప్పుడు ఆమెకు తెలియదేమో... ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో ఓ అద్భుతంగా నిలుస్తుందని!

శ్రీదేవి కాదనడంతో 'శివగామి' పాత్రను రమ్యకృష్ణ తన భుజాలపై వేసుకున్నారు. ఒక వేళ శ్రీదేవి చేసినా కూడా ఇంత అద్భుతంగా చేయలేదేమో అన్నంత గొప్పగా ఆ పాత్రను పండించారు.

శ్రీదేవికి ఇబ్బంది

శ్రీదేవికి ఇబ్బంది

అప్పుడు బాహుబలి అవకాశం వదులుకున్న ఇష్యూ.... ఇపుడు శ్రీదేవిని తెగ ఇబ్బంది పెడుతోంది. ప్రస్తుతం తన తాజా సినిమా ‘మామ్' సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్న శ్రీదేవికి మీడియా నుండి బాహుబలి ఇష్యూకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి.

నో కామెంట్

నో కామెంట్

మామ్ ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన శ్రీదేవికి శివగామి పాత్రను ఎందుకు వదులుకున్నారన్న ప్రశ్న ఎదురైంది. అయితే ఈ విషయమై స్పందించేందుకు శ్రీదేవి ఇష్టపడలేదు. ఈ విషయమై ప్రస్తుతానికి నో కామెంట్.... సమయం వచ్చినపుడు స్పందిస్తాను అంటూ ఆమె ఈ ఇష్యూ నుండి ఎస్కేప్ అయ్యారు.

రాజమౌళి

రాజమౌళి

అయితే శివగామి పాత్రకు మొదట రమ్యకృష్ణను అనుకున్నప్పటికీ తరువాత మార్కెట్‌ పెంచాలనే దృష్టిలో హిందీ యాక్టర్స్‌ పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసారట. అందుకే ప్రముఖ నటి శ్రీదేవితో సంప్రదింపులు జరిపినట్లు రాజమౌళి తెలిపారు. మా అదృష్టం బాగుండి ఆవిడ సినిమాను ఓకే చేయలేదు అని రాజమౌళి ఇటీవల ఆర్కే ఇంటర్వ్యూలో తెలిపారు.

మొత్తం పోయిండేది

మొత్తం పోయిండేది

ఒక వేళ శివగామి పాత్రలో రమ్యకృష్ణకు బదులు శ్రీదేవిని పెట్టుంటే సినిమా పోయుండేది కదా? అని ఆర్కే అడిగిన ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ...... అవును మొత్తం పోయిండేది అని రాజమౌళి తెలిపారు.

శ్రీదేవి ఎంత అడిగిందో తెలునా?

శ్రీదేవి ఎంత అడిగిందో తెలునా?

శివగామి పాత్ర చేయాలని శ్రీదేవి గారిని స్పందించిపుడు ఆమె భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసారని రాజమౌళిపారు. రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు ఆమె షూటింగుకు వచ్చిన ప్రతిసారి 5 బిజినెస్‌ క్లాస్‌ ఫ్లైట్ టిక్కెట్లు, బిగ్గెస్ట్‌ హోటల్‌లో 5 సూట్లు... ఏర్పాట్లు చేయాలని ఆమె కోరినట్లు రాజమౌళి తెలిపారు.

అది మరీ టూమచ్

అది మరీ టూమచ్

శ్రీదేవి భారీగా రెమ్యూనరేషన్ అడిగినప్పటికీ హిందీ రిలీజ్ ద్వారా కవర్ చేసుకోవచ్చని ఆమెతో డీల్ కుదుర్చుకుందామనుకున్నాం. కానీ ఆమె హిందీలో రిలీజ్‌లో లాభాల పర్సంటేజ్‌ కూడా అడిగారు. ఇదీ మరీ టూమచ్‌. ఇలా అయితే వర్కౌట్ కాదని వదిలేసామని రాజమౌళి తెలిపారు.

అంతా మన మంచికే జరిగిందని సంతోషంలో రాజమౌళి

అంతా మన మంచికే జరిగిందని సంతోషంలో రాజమౌళి

శ్రీదేవి గారితో డీల్ ఓకే కాక పోవడం అంతా మా మంచి కోసమే జరిగింది. ఒక వేళ ఆమెతో సినిమాచేసి ఉంటే ‘బాహుబలి' పరిస్థితి ఎలా ఉండేదో అని రాజమౌళి తన అభిప్రాయం వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X