twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: కంగనారనౌత్ బ్లూ ఫిల్మ్

    By Srikanya
    |

    ముంబై: ప్రభాస్ తో ఏక్ నిరంజన్ లోచేసిన కంగనా రనౌత్ గుర్తుంతే ఉండి ఉంటుంది. ఆమె తన గతాన్ని గుర్తు చేసుకుంటూ...తనతో బ్లూ ఫిలిం చేస్తున్నారని ఇంట్లో అనుకున్నారని చెప్పుకొచ్చింది. తన గతంలో తాను చాలా ధైర్యస్తురాలని అంది.

    కంగనా రనత్ మాట్లాడుతూ... నా తల్లి తండ్రులు నన్ను సినిమా ఇండస్ట్రీకి వెళ్లటానికి ఏక్సెప్టు చెయ్యలేదు. వారు నా ఆలోచనలు ఏక్సెప్టు చెయ్యటానికి చాలా కాలం పట్టింది. నాకు మొదటి ఆఫర్ వచ్చినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యి వారిని పిలిచాను. వారు నేను మర్డర్ తీసిన దర్శకుడు అనురాగు బసుతో చేస్తున్నానని తెలిసి చాలా భయపడ్డారు. నేను చాలా చిన్నపిల్లని కావటంతో నన్ను ఎక్సప్లాయిట్ చేసి బ్లూ ఫిలిం ని దర్శకులు తీస్తారని వాళ్లు భయపడ్డారని చెప్పుకొచ్చింది.

    బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజిని సంపాదించుకున్నారు కంగనా రనౌత్. ఆమె తాజాగా వ్యభిచారిగా కనిపించనుంది. విశ్వాస్‌ పాటిల్‌ 'ట్రావెల్డ్‌ ఎక్రాస్‌ ది బోర్డర్‌' చిత్రంలో కంగన వ్యభిచారిణి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం దర్శకనిర్మాతలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. వ్యభిచార గృహాల కేంద్రకమైన లాహోర్‌ హీరామండీ సెట్స్‌ని ముంబైలో యథాతథంగా వేసి సినిమాని చిత్రీకరించనున్నారు.

    మరోప్రక్క ఈ భామ దర్శకత్వం వైపు అడుగులు వేస్తోంది. ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా కంగనా దర్శకురాలి అవతారం ఎత్తబోతోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఈ లఘు చిత్రం చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో అంతా అమెరికన్లే నటించారు. ఒక కుక్క, నాలుగేళ్ల బాలుడు ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చైల్డ్ సైకాలజీ నేపథ్యంలో ఈ షార్ట్ ఫల్మ్ ఉంటుందని సమాచారం. టైటిల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించేందుకు అమ్మడు దాదాపు ఆరు నెలలు గ్రౌండ్ వర్క్ చేసిందట.

    ఈ లఘు చిత్రం గురించి కంగనా మాట్లాడుతూ...పిల్లలతో, జంతువులతో సినిమాలు తీయడం చాలా కష్టం. వాళ్లతో సినిమాలు తీయకూడదనే నేను అడ్వైజ్ ఇస్తా. కానీ నా స్క్రిప్టు డిమాండ్ చేసింది కాబట్టి నాకు తప్పలేదు. రహస్యంగా కెమెరాలు పెట్టి లిటిల్ బాయ్‌తో సినిమా తీశాం. అతన్ని ఆడిస్తూ షూటింగ్ జరుపుతూ చాలా కష్ట పడ్డాం, కుక్క అప్పటికే ట్రైనింగ్ అయి ఉంది కాబట్టి పెద్దగా కష్టం అనిపించలేదు అని చెప్పింది.

    English summary
    Kangana says... My parents didn’t approve of my acting career for a very long time. In fact, when I got the offer, I excitedly called them up. When they learnt that I’m doing a film with the same director (Anuraag Basu) who made Murder (2004), they were horrified. I was very young then and my poor mother feared that someone would exploit me and make a blue film with me.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X