అభిజిత్ ఎవరు?.. ఆ విషయం నాకు అర్థం కావడం లేదు.. మోనాల్ కామెంట్స్ వైరల్

బిగ్ బాస్ షోలో మోనాల్ ఎంత రచ్చ చేసిందో.. బయటకు వచ్చాక అంతకు మించి హల్చల్ చేస్తోంది. లోపల ఉన్న మోనాల్‌కు బయటకు వచ్చాక మాట్లాడుతున్న మోనాల్‌కు ఎంతో తేడా ఉంది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు మోనాల్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు చెబుతున్న వ్యాఖ్యలకు ఎంతో తేడా ఉంది. బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన మోనాల్ ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు షోలు, మరో వైపు సినీ అవకాశాలు అంటూ బిజీగానే గడుపుతోంది.

Photos: లావుగా ఉండే సెలబ్రెటీలు..ఇప్పుడు ఎంత నాజూగ్గా మారిపోయారో

డ్యాన్స్ ప్లస్ షోలో..

డ్యాన్స్ ప్లస్ షోలో..

బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక మోనాల్‌కు వచ్చిన మొదటి షో డ్యాన్స్ ప్లస్. అలా ఆమె బయటకు వచ్చిందో లేదో ఇలా ఆమెను ఆ షోలో తీసుకున్నారు. మోనాల్‌కు డ్యాన్స్‌కు ఎలాంటి సంబంధం ఉందో ఎందుకు తీసుకున్నారో వారికే తెలియాలి. మొత్తానికి ఆ షో, అందులో మోనాల్ ఏమీ మారలేదు. హగ్గులు, ట్రాకులతోనే ఆ షోను నెట్టుకొస్తున్నారు.

స్పెషల్ సాంగ్..

స్పెషల్ సాంగ్..

ఇక అల్లుడు అదుర్స్ సినిమాలో మోనాల్ చేసిన స్పెషల్ సాంగ్ కూడా అంతగా ఏమీ క్లిక్ అవ్వలేదు. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్లు ఓ మాదిరిగా వస్తున్నాయి. అయితే సినిమాను ఇంకా ప్రమోట్ చేసుకునేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మోనాల్ మీడియాతో ఇంటరాక్ట్ అయింది.

Recommended Video

Bigg Boss 4 Contestant Monal Gajjar In Dance Reality Show
బిగ్ బాస్ గురించి..

బిగ్ బాస్ గురించి..

అల్లుడు అదుర్స్ సినిమా విశేషాల గురించి మాట్లాడిన మోనాల్ మధ్యలో బిగ్ బాస్ టాపిక్‌లోకి వెళ్లింది. బిగ్ బాస్ షో వివాదాలు, తన డ్రెస్సింగ్ మీద వచ్చిన ట్రోల్స్, తన సోదరి హేమాలిని ట్రోల్ చేసిన విధానం, అభిజిత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ గురించి మోనాల్ మళ్లీ మాట్లాడింది.

అదృష్టం కొద్దీ..

అదృష్టం కొద్దీ..

అభిజిత్ ఫ్యాన్స్ నా అక్క హేమాలిని ట్రోల్ చేశారు.. చంపేస్తాం.. రేప్ చేస్తామని బెదిరించారు.. అది చాలా బాధగా అనిపించింది. అభిజిత్ నా గురించి వెనుక మాట్లాడాదు.. అదే విషయం మా అక్క చెప్పింది.. అలా వెనకలా మాట్లాడకు అని.. దానికే అతని ఫ్యాన్స్ అంతలా ట్రోల్ చేశారు.. అయినా అభిజిత్ లక్‌తో గెలిచాడు.. అన్నీ అలా కలిసి వచ్చాయి.. అందుకే గెలిచాడంటూ మోనాల్ చెప్పుకొచ్చింది.

 అభిజిత్ ఎవరు..

అభిజిత్ ఎవరు..

అసలు అభిజిత్ ఎవరు? బిగ్ బాస్ షోలో చూసింది నిజమైన అభిజితా? లేదా ఇప్పుడు ఇంటర్వ్యూల్లో చూస్తోన్నది నిజమైన అభిజితా? అన్నది నాకు అర్థం కావడం లేదంటూ మోనాల్ పేర్కొంది. మొత్తానికి సమసిపోయిన వివాదాలను మోనాల్ మళ్లీ తట్టి లేపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X