సెట్లోనే కుప్పకూలిన అల్లరి నరేష్ హీరోయిన్
చెన్నయ్ : అల్లరి నరేష్ సరసన 'సుడిగాడు' చిత్రంలో నటించిన హీరోయిన మోనాల్ గజ్జర్ తాజాగా ఓ తమిళ సినిమా షూటింగులో పాల్గొంటూ కళ్లు తిరిగి కింద పడి పోయింది. యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం ఆమె తమిళ చిత్రం 'వానవారాయన్ వల్లవారాయన్' చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తిరువనంతపురంలో జరుగుతోంది. షూటింగ్ కు హాజరైనప్పుడు బాగానే ఉన్న మోనాల్ బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత కొంతసేపటికి స్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ కుప్ప కూలి పోయిందని యూనిట్ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను ఐసియూలో ఉంచారు. అయితే ఔటాఫ్ డేంజర్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళంలో ఆమె నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ మోహన్ దర్శకత్వం వహిస్తుండగా కృష్ణ మరియు మోనాల్ గజ్జర్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలు తెలియాల్సి ఉంది.
మోనాల్ గజ్జర్ కి సంతకం చేస్తున్న వేగం చూస్తుంటే చాల మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో "వెన్నెల 1 1/2 చిత్రం వేసవికి వాయిదా వేయగా ఈ సమయంలో అల్లరి నరేష్ "సుడిగాడు" చిత్రంలో నటించింది వరుణ్ సందేశ్ తో కలిసి "ఒక కాలేజీ స్టొరీ" లో కనిపించనుంది ఇది కాకుండా వినయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "డ్రాకులా 3D" చిత్రంలో కూడా కనిపించనుంది.


Click it and Unblock the Notifications











