twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ.ఎన్టీఆర్ సినిమా చూసి తొడగొట్టా

    By Srikanya
    |

    హైదరాబాద్ :''ఈ చిత్రంలో నేను తొడ కొట్టే సీన్ ఒకటుంది. ఈ సీన్ చెప్పిన తర్వాత జూ.ఎన్టీఆర్ నటించిన సినిమా చూపించారు. అందులో ఎన్టీఆర్ చాలా పవర్‌ఫుల్‌గా తొడగొడతారు. ఈ షాట్ చేయడానికి నేను పది టేక్స్ తీసుకున్నాను. పదో టేక్‌కి ఓకే అయ్యింది. తొడగొట్టే సీన్ చేసేటప్పుడు చాలా థ్రిల్ అయ్యాను. ఆ సీన్ చేసే ముందు జూ. ఎన్టీఆర్ అదే సీన్‌ని ఎలా చేశారో తెలుసుకోవడానికి ఆయన నటించిన సినిమా చూశాను. ఆ తర్వాత నా స్టయిల్‌లో నేను చేశాను. ఇప్పుడు థియేటర్‌లో ఆ సీన్‌కి లభిస్తున్న స్పందన చూసి థ్రిల్ అయ్యాను'' అన్నారు మోనాల్‌గజ్జర్. 'అల్లరి' నరేష్, మోనాల్ జంటగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అరుంధతి మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ డి. నిర్మించిన 'సుడిగాడు' శుక్రవారం విడుదలయ్యింది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది.

    అలాగే 'సుడిగాడు' చిత్రంలో తాను నటించిన పాత్ర అందరికీ నచ్చుతోందని, ముఖ్యంగా మొదటినుండి చివరి దాకా తన నటనలో కనిపించిన స్పార్క్స్ మెచ్చుకుంటూ అనేకమంది మెయిల్స్ పంపిస్తున్నారని, తొడగొట్టే సీన్ అందరికీ నచ్చుతోందని, ఆ సన్నివేశం పండించడానికి తాను దాదాపుగా పది టేకులు తీసుకున్నానని నటి మోనాల్‌గజ్జర్ చెప్పింది. ఇక తాను ఇప్పటివరకూ మూడు చిత్రాల్లో నటించినా ప్రేక్షకుల ముందుకు తొలిసారిగా సుడిగాడు చిత్రం వచ్చిందని, పెద్ద సంస్థ, పెద్ద దర్శకుడితోపాటుగా పెద్ద హీరోతో ఈ చిత్రంలో నటించడం తనకానందాన్నిచ్చిందని, యూనిట్ మొత్తం ఎంతో సహకరించి, చిత్రం పూర్తయ్యేంతవరకు పనిచేశారని తెలిపింది.

    బ్రహ్మానందంగారు లాంటి సీనియర్ ఆర్టిస్టుల కాంబినేషన్‌లో సీన్స్ చేయడంవల్ల నటన గురించి చాలా విషయాలు తెలుసుకునే వీలు కలిగింది. 'సుడిగాడు' నాకు మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యింది'' అన్నారు. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తున్నానని, ఏ పాత్ర చేసినా, నూరు శాతం న్యాయం చేయడానికి కృషి చేస్తానని మోనాల్ చెప్పింది.

    గ్లామర్ కాకుండా కేవలం యాక్షన్‌పై ఆధారపడి తాను సినిమాలు చేస్తున్నానని, అటువంటి పాత్ర సుడిగాడులో తనకు లభించిందని ఆమె వివరించారు. ఒక కాలేజీ కథ, వెన్నెల 1 1/2 చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయని, ఓ తమిళ మూవీ, మరో మలయాళ చిత్రంలో తాను నటిస్తున్నానని తెలిపారు. త్వరలో ఓ తెలుగు చిత్రంలో స్టార్ హీరో సరసన నటించే అవకాశం వుందని, మిగతా వివరాలన్నీ త్వరలో తెలుపుతానని ఆమె వివరించారు.

    English summary
    
 Monal Gajjal making her debut as heroine with Sudigaadu film directed by Bheemineni Sreenivas Rao. It is said that the film is a full length spoof on Tollywood. The film is taken as remake of the Tamil film Thamizh Padam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X