Money Heist 5 దర్శక, నిర్మాతలకు షాక్: రిలీజైన కొద్ది గంటల్లోనే లీక్.. ఫ్రీ డౌన్‌లోడ్..

సినీ పరిశ్రమపై పైరసీ వెబ్‌సైట్ దాడులు దారుణంగా మారాయి. కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన చిత్రాలు కొన్ని రిలీజ్‌కు ముందే.. మరికొన్ని రిలీజైన కొద్ది గంటలకే హెచ్‌డీ ప్రింట్ ఫ్రీ డౌన్ ఆప్షన్ ఇస్తూ లీక్ చేశాయి. ఇటీవల కాలంలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2, షేర్షా, భుజ్, పాతాళ్ లోక్, లుడో, ఆర్య లాంటి పైరసీ వెబ్ సైట్లో లీక్ అయింది. తాజాగా మనీ హీస్ట్‌ సీజన్ 5పై పైరసీదారులు పంజా విసిరారు. ఆ వివరాల్లోకి వెళితే..

 సోషల్ మీడియాలో ట్రెండింగ్

సోషల్ మీడియాలో ట్రెండింగ్

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ మనీ హీస్ట్. గత ఐదు సీజన్లతో విశేషంగా ఆకట్టుకొంటున్న ఈ వెబ్ సిరీస్‌ అత్యంత ప్రేక్షకాదరణకు లోనైంది. ఇలా ఎందరినో వెయిటింగ్ చేయించిన మనీ హీస్ట్ సీజన్ 5 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో ఈ వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అయితే ఈ వెబ్ సిరీస్ అలా నెట్‌ఫ్లిక్స్ వచ్చిందో లేదో.. అన్ని ఎపిసోడ్స్ పైరసీ వెబ్‌సైట్లతో లీక్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మనీ హీస్ట్ వెబ్ సిరీస్‌లో

మనీ హీస్ట్ వెబ్ సిరీస్‌లో

ప్రపంచంలోనే అత్యధిక టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొన్న మనీ హీస్ట్ వెబ్ సీరిస్‌లో ఉర్సులా కార్బెరో (టోక్యో), అల్వారో మోర్టే (ది ప్రొఫెసర్) ఇట్జియార్ ఇటునో (లిబ్సన్), మిగేల్ హెర్రెయిన్ (రియా), జైమే లారెంటె (డెన్వర్) ఈస్తర్ అకెబో (స్టాక్‌హోమ్), హోవిక్ కేచ్‌కేరియన్ (బగోటా)గా నటించారు. ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులు ఈ సిరీస్‌లో నటించారు. అలెక్స్ పినా దర్శకత్వం వహించారు.

దోపిడి మఠా 100 గంటలు

దోపిడి మఠా 100 గంటలు

ఇక మనీ హీస్ట్ సీజన్ 5 గురించి వెల్లడిస్తూ.. బ్యాంక్ ఆఫ్ స్పెయిన్‌లో దోపిడి ముఠా 100 గంటలకు పైగా ఉన్నారు. గ్యాంగ్‌కు బాస్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌కు ముప్పులో పడ్డారు. పరిస్థితులు మరింత దారుణంగా మారి.. ఆర్మీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అంటూ కామెంట్ చేశారు.

Recommended Video

Netflix Keeps Growing In Pandemic, Tops 200 Million Subscribers
తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్, టెలిగ్రామ్‌లో

తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్, టెలిగ్రామ్‌లో

ఇదిలా ఉండగా, మనీ హీస్ట్: సీజన్ 5 వెబ్ సిరీస్ పలు టొరెంట్స్ సైట్లో హెచ్‌డీ క్వాలిటీ ఫ్రీ డౌన్‌లోడ్ ఆప్షన్ ఇచ్చాయి. తమిళ్ రాకర్స్, టెలిగ్రామ్, మూవీ రూల్జ్, తదితర వెబ్‌సైట్లలో దర్శనమిచ్చింది. దాంతో కొందరు నెటిజన్లు ట్వీట్లు చేస్తూ మనీ హీస్ట్ 5 నిర్మాతలకు భారీ దెబ్బ అంటూ కామెంట్ చేస్తున్నారు. నిర్మాతలకు రాబడికి పెద్ద లోటు ఏర్పడే అవకాశం ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X