మెదక్ నుంచి పార్లమెంట్ కి పోటీ చేస్తున్న టీఆర్ ఎస్ అభ్యర్ది సినీనటి విజయశాంతికి చెందిన ఐదు లక్షలు రూపాయలు బంజారాహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు నిర్వహిస్తున్న వాహనాల సోదాల్లో భాగంగా శ్రీనివాస్ రావు అనే సినీ మేకప్ మేన్ నుంచి ఈ మొత్తాన్ని పట్టుకున్నారు. రాత్రి టాటా సఫారీలో వెళ్తూండగా పోలీసులు హైదరాబాద్ లోని సత్యసాయి నిగమాగమం వద్ద వాహనాలను ఆపి సోదా చేస్తూండగా ఈ నగదు లభించింది. అందులో ఉన్న డబ్బులుకు ఎలాంటి లెక్కలు, ఆధారిత ధృవపత్రాలు శ్రీనివాసరావు వద్ద లేవని పోలీసులు తెలిపారు. డబ్బుని స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుననారు.