మనీ స్పిన్నర్- మాస్టర్ మైండ్: అల్లు అరవింద్

By Sindhu

బిజినెస్ లో అల్లు అరవింద్ ను మించినవారు ఉండరు అని చెప్పవచ్చు. అందుకే చిరంజీవి అభిమానులు అల్లు అరవింద్ ను మాస్టర్ మైండ్ అంటుంటారు. స్వతహాగా సొంత సినిమాలకు తప్పితే, ఇతర సినిమాలు ఏదైన సినిమా చాలా బాగుంది అని సాటిస్ ఫై అయితే తప్ప, ఇతర సినిమాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరని అందరికీ తెలిసిన విషయమే. అయితే అల్లు అరవింద్, మహేష్ బాబు సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ముందుకొచ్చాడంటే ఈ విషయం వెనుక పెద్ద బిజినెస్ దాగుందని అందరికీ అర్థం అవుతుంది.

జల్సా, గజిని(హిందీ), మగధీర లతో అధ్భుతమైన విజయాలను సాధించిన అల్లు అరవింద్ ఇప్పుడు మహేష్ బాబు సినిమాను ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా! మరి మహేష్ నటించిన చిత్రం వచ్చి సుమారు రెండు సంవత్సారాలు అవుతుంది కదా! అతని అభిమానులు సినిమాకోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపుల్ని క్యాష్ చేసుకోవడానికి అల్లు అరవింద్ సినిమాను తన చేతులలోనికి తీసుకుంటున్నాడు. అది అసలు విషయం.

ఇక సినిమా విషయానికి వస్తే, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'కలేజా" అనే టైటిల్ అనుకుంటున్నారు. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని పోకిరి ఇచ్చినంత బిగ్ హిట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. మహేష్ బాబు సరసన కథనాయికగా అనుష్కా నటించనుంది. ఈ చిత్ర నిర్మాత సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసందే. ఈ సినిమాను అల్లు అరవింద్ నిజాం మరియు ఆంధ్రా ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.

అయితే తెలంగాణ కోసం నిజామ్ లో చోటు చేసుకొన్న అనుకోని పరణామాలు వల్ల కొద్దిగా షాక్ తిన్న అల్లు కొంచెం అంసంతృప్తి చెందాడు. ఏదైతేనేం కొద్దిపాటి రిస్క్ తో నిజాంలో ఫ్రిన్స్ మహేష్ బాబు సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడంటే, మహేష్ ఆ సినిమాలో చాలా వరైటీస్ చేశాడని అర్థమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X