Adipurush సినిమా చూడటానికి వచ్చిన హనుమాన్ రూపం.. సీన్ చూసి షాకైన ప్రభాస్ ఫ్యాన్స్.. వీడియో వైరల్

'ఆదిపురుష్.. ఆదిపురుష్.. ఆదిపురుష్..' ఇప్పుడు ఏ నోట విన్నా.. ఎక్కడ చూసిన ఈ సినిమాకు సంబంధించిన మాటలే వినిపిస్తున్నాయి. అంతలా ఈ పౌరాణిక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తోంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ రూపొందించిన ఈ మూవీ తాజాగా విడుదలైంది. దీంతో వరల్డ్ వైడ్‌గా థియేటర్లు అన్నీ శ్రీరామ నామంతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆదిపురుష్' సినిమా థియేటర్‌లో నిజమైన హనుమంతుడి రూపం కనిపించింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

సీతతో కలిసి రాముడు వచ్చాడు:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో వచ్చిన చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ దీనికి సంగీతం అందించారు.

Monkey Watched Prabhas Starrer Adipurush Movie At Theatre

గ్రాండ్ రిలీజ్.. అంతటా హవా:రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న 'ఆదిపురుష్' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకుల గోలతో దద్దరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ కళకళలాడుతున్నాయి. ఇలా ఈ చిత్రం హవాను చూపిస్తోంది.

హనుమంతుడి కోసం ప్రత్యేకం:పౌరాణిక జోనర్‌లో రూపొందిన 'ఆదిపురుష్' మూవీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా దీనికి మంచి స్పందన దక్కింది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. ఇక, ఈ సినిమా థియేటర్లలో హనుమంతుడి కోసం ఓ సీటును కేటాయించారు. దాన్ని వదిలేసి మిగిలినవన్నీ అమ్మేశారు.

Monkey Watched Prabhas Starrer Adipurush Movie At Theatre

హనుమంతుడి సీటు కాషాయం:'ఆదిపురుష్' ప్రదర్శితం అయ్యే థియేటర్లలో హనుమంతుడి కోసం ఉంచిన సీటులో కాషాయ రంగు బట్టతో అలంకరించారు. దాని మీద సీతారామ రూపాలను గుండెళ్లో దాచుకున్న హనుమంతుడి చిత్ర పటంతో పాటు 'జై శ్రీరామ్' అనే స్లోగన్ కూడా రాసి ఉంది. చిత్ర యూనిట్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి అన్ని వర్గాల వాళ్ల నుంచి మంచి స్పందన దక్కుతోంది.

Monkey Watched Prabhas Starrer Adipurush Movie At Theatre

ఆదిపురుష్ చూసిన హనుమాన్:యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 4 గంటల నుంచే షోలో ప్రదర్శితం అవుతున్నాయి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా షోలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ థియేటర్‌లో ఈ సినిమాను చూడడానికి రియల్ హనుమాన్ (కోతి) వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

షాకైన ఫ్యాన్స్.. సంతోషంగానే:'ఆదిపురుష్' మూవీ ప్రదర్శితం అవుతోన్న ఓ థియేటర్‌లోకి వానరం వచ్చింది. అది వెంటిలేటర్‌ ఉన్న ప్రాంతంలో కూర్చుని కాసేపు సినిమాను చూసింది. ఇది గమనించిన ఫ్యాన్స్ షాకైపోయి వీడియోలు తీయడం మొదలు పెట్టారు. అంతేకాదు, అక్కడ లైట్లు కూడా వేయడంతో అందరూ అరిచారు. దీంతో ఆ వానరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇది చూసిన వాళ్లంతా నిజంగా హనుమంతుడే శ్రీరాముడి సినిమాకు వచ్చాడని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X