twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా పాట నీనోట ‘మూగ మనసులు’ గుర్తుందా?

    By Staff
    |

    మూగ మనసులు" సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది 'నా పాట నీనోట పలకాల సిలకా". ప్రతి ఒక్కరి మనస్సులో మెదలుతుంది. కానీ ఇప్పటి జనరేషన్లో ఏ పాట ఎలా వుంటుందో, అర్థం పర్థం కానీ విధంగా వుంటున్నాయి. కానీ అప్పట్లో......

    ఆదుర్త సుబ్బారావు దాదాపు అంతా బౌట్ డోర్ లో, గోదారి నేపథ్యంలో తీసిన 'మూగ మనసులు" 1964వ సంవత్సరంలో విడుదలై విజయం సాధించింది. తెలుగు సినిమా రంగానికి, ఈ చిత్రానికి తెరపై అక్కినేని, సావిత్రి, జమున, గుమ్మడి, తెర వెనుక ఆదుర్తి, ఆత్రేయ, ముళ్లపూడి, మహదేవన్, ఘంటసాల వచ్చారు, కానీ, అవేవీ సాధారణ ప్రేక్షకుడి మనసులోకి జొరబడలేకపోయాయి. సరళమైన కథా గమనంతో సాగిన 'మూగ మనసులు" చిత్రం మాస్ ప్రేక్షకుల్ని సైతం అలరించింది. ఈ చిత్రానికి కేంద్ర ప్రభుత్వం యోగ్యతా పత్రం లభించింది.

    తెలుగులో విజయవంతమైన ఈ చిత్రాన్ని 'మిలన్" పేరుతో హిందీలో తీయగా అక్కడా విజయవంతమైంది. అయితే మహానటి సావిత్రి 'ప్రాప్తం" పేరుతో తీసిన తమిల చిత్రం మాత్రం ఫ్లాప్ అయింది. ఇదే కథను కొద్దిపాటి మార్పులతో తర్వాత కాలంలో యువచిత్ర పతాకంపై కె. మురారి 'జానకిరాముడుగా" నిర్మిస్తే ఘనవిజయం సాధించింది. అలా జానకిరాముడు ఘన విజయం సాధించిన నాటి 'మూగమనసులు" లోని కళాత్మక, సాంకేతిక విలువల్ని మాత్రం ఈ చిత్రం సాదించలేకపోయింది. ఆత్రేయ, కె.వి. మహదేవన్లు ఈ చిత్రానికి కూడా పని చేయడం గమనించదగ్గ అంశం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X