డైనమిక్ హీరో రామ్ చరణ్ ‘ఆరెంజ్’ పై పెరిగిపోతున్న భారీ అంచనాలు...
'ఆరెంజ్" సినిమా కోసం పద్నాలుగు వేల అడుగుల ఎత్తు నుంచి రామ్ చరణ్ స్కై డైవ్ చేయబోతున్నాడని ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సీన్ ని సినిమాలో ఆఖరు సీన్ గా చిత్రీకరించారు. దానిని చరణ్ విజయవంతంగా పూర్తి చేశాడు. విదేశీ స్టంట్ డైరెక్టర్ హారీ పర్యవేక్షణలో చరణ్ ఈ డైవ్ చేశాడు. 'ఆరెంజ్" ప్రత్యేకతల్లో ఇదొకటని చెబుతున్నారు. తండ్రి నుంచి నటననే కాకుండా రిస్కీ స్టంట్స్ డూప్ లేకుండా చేసే ధైర్యాన్ని కూడా సొంతం చేసుకున్నానని చరణ్ ఈ విధంగా చెప్పకనే చెబుతున్నాడు.
'ఆరెంజ్" పాటలు ఇప్పుడు ఆంద్రా అంతటా ఊపేస్తున్నాయి. మరో మూడు వారాల్లో విడుదలకి సిద్దపడుతోన్న ఈ చిత్రం కోసం నిర్మాణాంతర పనులను వేగవంతం చేశారు. ఈ చిత్రంలో చరణ్ ప్లే బాయ్ పాత్రను పోషించాడు. నిజమైన ప్రేమ కోసం అన్వేషించే ప్రయత్నంలో కనిపించిన అమ్మాయినల్లా ప్రేమించే చరణ్ కి జెనీలియా తారసపడుతుంది. తను కోరుకునే అమ్మాయి తనేనని తెలుసుకున్నా అతడిని ఆమె నిరాకరిస్తుంది. ఆమె మనసుని చరణ్ ఎలా గెలుచుకుంటాడనేదే ఆరెంజ్ కథ అని తెలిసిందే. మగధీర తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆరెంజ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి వాటిని ఈ చిత్రం ఎంతవరకు అందుకుంటుందనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











