ఆడియన్స్ ఫామ్ లోకి రావాలంటే ‘తీన్ మార్’ రావాల్సిందే..
ఈ సమ్మర్ కి ఓపెనింగ్ బాద్యత తీసుకున్న జూ ఎన్టీఆర్ డిజప్పాయింట్ చేయడంతో ఇక వన్ డౌన్ లో వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా 'తీన్ మార్" మీదే చిత్ర పరిశ్రమ ఆశలన్నీ పెట్టుకొంది. క్రికెట్ కారణంగా కుదేలైన చిత్ర పరిశ్రమకి మళ్లీ ఐపిఎల్ ముప్పు పొంచి ఉంది. క్రికెట్ మూడ్ నుంచి ఆడియన్స్ ని డైవర్ట్ చేసే మూవీ ఇప్పుడు వచ్చి తీరాలి.
'శక్తి" ఆల్రెడీ డిఫెన్స్ లో పడిపోవడంతో ఇక ఆ బాధ్యత 'తీన్ మార్" మీదే పడింది. ఈ సమ్మర్ కి వస్తున్న బిగ్ స్టార్స్ సినిమాల్లో తీన్ మార్ ఒకటి కావడంతో ఈ చిత్రానికి కనీసం డీసెంట్ టాక్ వచ్చి బాక్సాఫీస్ ని బిజీగా ఉంచుతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. మిస్టర్ ఫర్ ఫెక్ట్ కూడా రిలీజ్ కి రెడీగా ఉన్నప్పటికీ అది మహా అయితే డార్లింగ్ మాదిరిగా స్లీపర్ హిట్ అవుతుందేమోననే అనుమానాలుండడంతో 'కిక్" ఇప్పుడు బిగ్ హిట్ తీన్ మారే కావాలి. రీమేక్ సినిమా అయినా కానీ ఫ్రీ రిలీజ్ హైప్ కి తగ్గ మెటీరియల్ అయితే తీన్ మార్ లో ఉంది. ఇక దీనిని నిజంగా టైటిల్ కి తగ్గ సినిమా చేసే రెస్పాన్సిబులిటీ పవన్ పైనే ఉంది.


Click it and Unblock the Notifications











