బాలయ్య అంటే భయంలేదు..రామ్ చరణ్ అంటే భయమా....
చిరుత, మగధీర రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న రామ్ చరణ్ తేజ్ సినిమా వస్తుందంటే మిగతా హీరోలు అతనితో పోటీ పడడానికి వెనకడుగువేస్తున్నారు. కానీ సినీ పరిశ్రమలో పాతుకుపోయిన బాలకృష్ణకి ఎవరూ భయపడ్డం లేదు. సింహా లాంటి సూపర్ హిట్ ఇచ్చినా కూడా బాలకృష్ణ తర్వాత చిత్రం తో పోటిపడటానికి చాలా మంది హీరోలు రెడీ అవుతున్నారు.
దాసరి దర్శకత్వంలో 'పరమవీర చక్ర" చిత్రం సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేయాలనే జరుగుతుంటే, అతని సినిమాతో అమీ తమీ తేల్చుకోవడానికి రాణా, రవితేజ, ప్రభాస్, గోపిచంద్ తదితరులంతా తమ చిత్రాలని సంక్రాంతికే విడుదల చేస్తున్నారు. అదే ఆరెంజ్ రిలీజ్ ఉందనే సరికి వెంకటేష్, రామ్ గోపాల్ వర్మలాంటి వాళ్లు కూడా తమ సినిమాలని వాయిదా వేసుకుంటున్నారు. సినిమా హిట్ అయినా కూడా తననెవ్వరూ లెక్కచేయట్లేదని బాలకృష్ణ కూడా గుర్తించే ఉంటాడు. అందుకే దాసరితో కలిసి పరమవీరచక్రతో తన పవర్ ఏంటో చూపించి, తనతో పెట్టుకున్నందుకు అందరికీ తగిన శాస్తి జరిగేలా విజృంభించాలనుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











