వివాదాల్లో దాసరి-బాలయ్య ల‘పరమవీరచక్ర’!?

By Sindhu

ఇంకా సినిమా మొదలు కాకుండానే, సెట్స్ మీదకు రాకుండానే 'పరమవీరచక్ర" వివాదాల్లో కూరుకుపోతోంది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించనున్న 'పరమవీరచక్ర" సినిమాని సి. కళ్యాణ్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామని దాసరి ప్రకటించడం, టాలీవుడ్ లో బాలకృష్ణ తప్ప మరెవరూ 'పరమవీరచక్ర" పాత్రకు సరిపోరని దాసరి వెల్లడించడం తెల్సిన విషయాలే.

అయితే సైనికులకు భారత ప్రభుత్వం ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'పరమవీరచక్ర" పురస్కారాన్ని టైటిల్ గా పెట్టి సినిమా తీస్తున్నప్పుడు, అందులో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలుండకూడదనే డిమాండ్ తెరపైకొచ్చింది. వ్యాపారాత్మక ధోరణి లో 'పరమవీరచక్ర" పేరును వాడుకోవడం సరికాదంటూ కోర్టుకెక్కేందుకు సిధ్దమవుతున్నాయి కొన్ని ప్రజా సంఘాలు.

ఈ మేరకు దర్శక నిర్మాతలకు ఓ విజ్ఝప్తి కూడా చేస్తామని, అసభ్యకర సన్నివేవాలు, డ్యూయెట్లు, బూతు డైలాగులు వుండవని హామీ ఇవ్వడంతోపాటు, సమాజానికి మంచి చేసేలా సినిమాని రూపొందిస్తామనే భరోసా ప్రజలకు కల్సించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కమర్షియల్ చట్రంలో ఇరుక్కున్న తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఏ సినిమా వచ్చినా, కమర్షియల్ హంగులంటూ హీరోయిన్ల అందాల ఆరబోత, బూతు డైలాగులు సర్వసాధారణమైపోయిన ప్రస్తుత తరుణంలో, దాసరి వాటికి అతీతంగా 'పరమవీరచక్ర తీస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే!?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X