మహేష్ బాబుకి ఏరియాకో కొత్త టైటిల్
మహేష్ బాబుకి రోజుకో కొత్త టైటిల్ ఇచ్చేస్తున్నారు. ఎలాగూ శ్రీను వైట్ల తన దూకుడులో సూపర్ స్టార్ అని బిరుదు ఇచ్చేసాడు. ఇక దూకుడులో తెలంగాణా స్లాంగ్ బాగా పేలటంతో అక్కడ నైజాం నవాబ్ అని అంచున్నారు. అలాగే ఆంధ్రాలో ఆంద్రా రారాజు అని బిరుదు ఇచ్చారు. ఇక సీడెడ్ లో కలెక్షన్స్ ని చూసి సీడెడ్ సుల్తాన్ అని తేల్చారు. ఇక భాక్సాఫీస్ బాద్షా అని యాడ్స్ లో బిరుదు ఇచ్చి యాడ్స్ ఇచ్చారు. ఇక మహేష్ తన దూకుడు చిత్రం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాను కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఇది యూనివర్శల్ స్క్రిప్ట్. నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. నా కెరీర్‌లోనే దూకుడు బెస్ట్ స్క్రిప్ట్‌గా చెప్పగలుగుతాను. అన్ని ఎమోషన్లు పలికించడానికి ఈ కేరక్టర్ నాకు అవకాశం కల్పించింది అన్నారు.
పోకిరి చిత్రం అనంతరం మహేష్ నటించిన సినిమాలేవి ఆడలేదు. దూకుడు చిత్రం తోనే ఆయన తిరిగి ఫామ్ లోకి వచ్చారని చెప్పాలి. అలాగే ఫస్ట్ టైమ్‌లో ఎమ్మెల్యే గెటప్‌లో కనిపించడం మంచి అనుభూతినిచ్చింది అన్నారు. ఆ పాత్ర గురించి మాట్లాడుతూ..కొత్తగా ఉంది. సినిమాకి హైలైట్ అవుతుందని అందరం అనుకున్నాం. నా మెడలో పులిగోరు, వైట్ అండ్ వైట్ డ్రస్ అందరికీ నచ్చింది. నాక్కూడా బాగా నచ్చింది అన్నారు.3 ఇడియట్స్ ఓవర్‌సీస్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంటే.. నంబర్ 2 ప్లేస్‌లో దూకుడు ఉంది. పది కోట్లకు పైనే అక్కడ వసూలు చేసింది ఈ సినిమా. మన దగ్గర నైజాం కలెక్షన్లతో సమానంగా ఓవర్‌సీస్‌లో వసూలు చేసింది. మన తెలుగువారందరూ గర్వపడాల్సిన విషయం అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











