లోదుస్తులతో హీరోయిన్ మార్ఫింగ్ ఫోటో.. ఆ విషయం ప్రకటించిన కొన్ని గంటల్లోనే!
ప్రముఖ బెంగాలీ నటి నుస్రత్ జహన్ కు సోషల్ మీడియా వేదికగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతుత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుస్రత్ కు త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో టికెట్ కేటాయించింది. పార్టీ ఈ విషయాన్ని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆమెపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ మొదలైంది. నుస్రత్ గతంలో సినిమాల్లో నటించిన హాట్ ఫోటోలని ట్రోల్ చేస్తూ తీవ్రంగా విమర్శించారు. నుస్రత్ పై సోషల్ మీడియాలో అటాక్ హద్దులు దాటింది.

లోదుస్తుల్లో ఉన్న ఫోటో
నుస్రత్ లోదుస్తుల్లో ఉన్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ అది నుస్రత్ ఫోటో కాదు. కొందరు ఆకతాయిలు ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి నుస్రత్ ముఖాన్ని అంటించారు. ఫోటో చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతోంది. నుస్రత్ వ్యతిరేకులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. నుస్రత్ ఇటీవల తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆమెపై ఈ దాడి జరుగుతోంది.

కొన్ని గంటల్లోనే
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుస్రత్ ని లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ మార్ఫింగ్ ఫోటో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నుస్రత్ పై చెడు ముద్ర వేసేందుకే ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు సృస్టిస్తునట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై నుస్రత్ స్పందించాల్సి ఉంది. నుస్రత్ ఫోటోని మార్పింగ్ చేసిన ఒరిజినల్ ఫోటోని ఓ పోర్న్ సైట్ నుంచి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 29 ఏళ్ల నుస్రత్ పలు బెంగాలి చిత్రాల్లో నటించింది. ఇప్పటికి నటిగా కొనసాగుతోంది. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి నుస్రత్ ఇప్పటికే స్పందించింది.

మార్పు రావాలి
మహిళలంతా కోరుకునేది ఇలాంటి విషయాల్లో మార్పు రావాలనే. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మహిళలని కించపరచడానికి ఎంచుకున్న ఓ మార్గం. ఈ వైఖరిలో మార్పు రావాలి. మహిళలకు మరింత గౌరవం ఇవ్వాలి అని నుస్రత్ తెలిపింది. అసలు వీళ్లంతా నాపై ఎందుకు ఇలా విమర్శలు, అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారో అర్థం కావడం లేదు.

మరో నటి కూడా
నుస్రత్ తో పాటు మరో హీరోయిన్ కు కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాబోవు ఎన్నికల్లో లోక్ సభ టికెట్ కేటాయించింది. పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన మిమి చక్రవర్తికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో సినీ తారలు, క్రీడాకారులు ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు. మిమి చక్రవర్తి జాదవ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











