Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సింగర్ ఫొటోని మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు....
"చార్ చార్ బంగ్డీవాలీ"గాయని కింజాల్ దేవీ ఫోటోని మార్ఫ్ చేసారు అమరాయివాడికి చెందిన నీరజ్ మక్వానా అనే యువకుడు నిందితుడుతన పెళ్లి చిత్రంలో భార్యను తొలగించి ఆ స్థానంలో గాయని కింజాల్ ఫోటోను మార్ఫింగ్
కింజాల్ దేవీ ఈ పేరు మనకి పెద్దగా పరిచయం లెరకపోవచ్చు గానీ ఆమధ్య ''చార్ చార్ బంగ్డీవాలీ''అంటూ గుజరాతీ జానపద గీతాన్ని ఆలపించి యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. పాపం ఈ అమ్మాయి కూడా కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడింది. అసలు కింజాల్ దేవీ కి కూడా తెలియని 30 ఏళ్ల యువకుడొకరు తన ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తన భార్య అంటూ ఫోటో పెట్టడాన్ని చూసి కింజాల్దేవి షాక్‌కు గురైంది.
సోషల్ మీడియాలో తన ఫోటో వచ్చిందంటూ స్నేహితులు చెప్పడంతో కింజాల్ వెంటనే చూసి విషయాన్ని తండ్రి లాల్జీభాయి దేవికి చెప్పింది. కింజాల్ తండ్రి అహ్మదాబాద్ క్రైంబ్రాంచ్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారంగా అమరాయివాడికి చెందిన నీరజ్ మక్వానా అనే యువకుడు నిందితుడని గుర్తించారు.
ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న నీరజ్ తన పెళ్లి చిత్రంలో భార్యను తొలగించి ఆ స్థానంలో గాయని కింజాల్ ఫోటోను మార్ఫింగ్ చేసి భార్యంటూ సోషల్ మీడియాలో పెట్టాడని అహ్మదాబాద్ సైబర్ సెల్ ఏసీపీ రాజ్వీర్సింగ్ చెప్పారు. నిందితుడైన నీరజ్ ను అరెస్టు చేసి రిమాండుకు తరలించామని ఏసీపీ వివరించారు.