twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ తల్లి ఫోటోలు మార్ఫింగ్.. వేగంగా పసిగట్టిన పోలీసులు, నీచానికి దిగజారుతున్నారు!

    |

    Recommended Video

    Pawan Kalyan’s Mom Morphed Pics Posted In Social Media

    పవన్ కళ్యాణ్ ప్రతిష్టని దిగజార్చడానికి ప్రయత్నిస్తున్న కొందరు దుండగులు రోజు రోజుకు దిగజారిపోతున్నారు. శ్రీరెడ్డి ఆ మధ్యన పబ్లిక్ గా పవన్ కళ్యాణ్ తల్లిని దారుణమైన పదజాలంతో దూషించిన ఘటన మరువక ముందే మరో కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ సారి కూడా పవన్ ని కించపరచడానికి ప్రయత్నిస్తున్న వారు ఆయన తల్లిని టార్గెట్ చేశారు. తాజా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

    ఫోటోలు మార్ఫింగ్

    ఫోటోలు మార్ఫింగ్

    సోషల్ మీడియా ముసుగులో నేరాలు చేసేవారు మరో మారు పవన్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ తల్లి ఫోటోలని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. చంటబ్బాయ్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి పవన్ తల్లి తల్లి మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు.

    పోలీసులకు ఫిర్యాదు

    పోలీసులకు ఫిర్యాదు

    ఈ ఫోటోలని శ్రావణ్ అనే వ్యక్తి గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడి ఐపి అడ్రెస్ గుర్తించాం. ఫిర్యాదు చేసిన వ్యక్తి రాత పూర్వకంగా కంప్లైన్ట్ ఇస్తే త్వరలోనే అతడి గుట్టు రట్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

    ఫ్యాన్స్ ఫైర్

    ఫ్యాన్స్ ఫైర్

    ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండి పడుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయనతో ముఖా ముఖీ తలపడే ధైర్యం లేకే ఇలాంటి నీచాలకు దిగజారుతున్నట్లు పవన్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

    శ్రీరెడ్డి ఘటన

    శ్రీరెడ్డి ఘటన

    శ్రీరెడ్డి అకారణంగా పవన్ తల్లిని దూషించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అన్ని వర్గాల ప్రజల నుంచి శ్రీరెడ్డిపై, కొన్ని వర్గాల మీడియాపై తీవ్రమైన విమర్శలు చెలరేగాయి. ఆ ఘటన మరిచిపోకముందే మరోమారు పవన్ తల్లిని టార్గెట్ చేశారు.

    English summary
    Morphed pics of Pawan Kalyan’s mom posted. Hyderabad Police starts investigation
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X