»   » ఈ చెత్త పని చేసింది.... ఎవరి అభిమానులో?

ఈ చెత్త పని చేసింది.... ఎవరి అభిమానులో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2016వ సంవత్సరం బాలీవుడ్ జంటలకు అంతగా కలిసొచ్చేట్లు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలోనే కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా చేరిపోయారు. ఎంజాయ్ చేసింత కాలం లవ్ లైఫ్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేసిన ఈ జంట పలు కారణాలతో విడిపోయారు.

ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారనే సంగతి పక్కన పెడితే.... ఇపుడు వీరి అభిమానుల అత్యుత్సాహం ఎక్కువైంది. వీరికి సంబంధించిన ఫోటోలు మార్పింగ్ చేసి ఇంటర్నెట్లో పోస్టు చేస్తున్నారు. అలా మార్పింగ్ చేసిన ఫోటో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. చూడటానికి జుగుప్సా కరంగా ఉన్న చర్యకు పాల్పడింది ఈ ఇద్దరిలో ఎవరి అభిమానులో? అనేది తెలియడం లేదు.

Morphed Virat-Anushka's pic goes viral

2016 సంవత్సరంలో అనుష్క శర్మ తన ఫోకస్ అంతా కెరీర్ మీదనే పెట్టాలని నిర్ణయించుకుంది. నటిగా, నిర్మాతగా ఉన్నత స్థాయికి ఎదగాలనేది ఆమె లక్ష్యం. కాని పెళ్లి చేసుకుని సెటిలైపోదామని కోహ్లి ఉద్దేశ్యం. లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఇంకొంత కాలం వెయిట్ చేయాలనేది అనుష్క అభిప్రాయం. ఈ విషయమై ఇద్దరి మద్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయేంతగా గొడవ జరిగినట్లు బయట ప్రచారం జరుగుతోంది.

అయినా సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్ల మధ్య ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణమే. క్రికెట్ స్టార్లు ఈ విషయంలో కాస్త నిలకడగా ఉంటారు. సినిమా స్టార్లు మాత్రం అలా కాదు. ముఖ్యంగా కెరీర్ మంచి జోరుమీద ఉన్నపుడు పెళ్లి సుకోవాలనే అంశానికి వీలైనంత దూరంగా ఉంటారు.

English summary
An image has been circulating on the internet which represents Virat’s face and Anu’s face morphed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu