మోసగాళ్లు ప్రీ రిలీజ్ రివ్యూ.. కాజల్ అగర్వాల్, విష్ణు మంచు ఎమోషన్స్‌‌ హైలెట్‌గా

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మాతగా, హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రూపొందించిన చిత్రం మోసగాళ్లు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, నవదీప్, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. 2020లో రిలీజ్ చేయాలని ప్రయత్నించారు. కానీ కోవిడ్19 కారణంగా థియేటర్లు మూత పడటంతో 2021లో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి కొన్ని ముఖ్య విషయాలు.

వాస్తవ సంఘటనల ఆధారంగా మోసగాళ్లు

వాస్తవ సంఘటనల ఆధారంగా మోసగాళ్లు

నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం మోసగాళ్లు. భారతీయ ఐటీ పరిశ్రమలోని ఓ కాల్ సెంటర్‌లో చోటుచేసుకొన్న 2800 కోట్ల భారీ కుంభకోణం ఆధారంగా జరిగిన కథగా తెరకెక్కింది. ఈ కుంభకోణానికి ప్రధాన కారణం అను (కాజల్ అగర్వాల్) అర్జున్ (విష్ణు మంచు) ఎందుకు అయ్యారనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమా రూపొందింది.

రూ.51 కోట్ల బడ్జెట్‌తో

రూ.51 కోట్ల బడ్జెట్‌తో


తల్లిదండ్రులు పడిన అవమానం భరించ లేక.. ఆ అక్కాతమ్ముడు ఇలా మోసం చేస్తుంటారు. అక్క కాజల్, తమ్ముడి విష్ణు మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. ఫ్యామిలీ, సెంటిమెంట్స్, అర్థం, పరమార్థం ఉన్న సినిమా విషయాన్ని చిత్ర యూనిట్ పేర్కొన్నది. దాదాపు 51 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు.

అక్కా, తమ్ముడి బంధం హైలెట్‌గా

అక్కా, తమ్ముడి బంధం హైలెట్‌గా

తొలిసారి కాజల్ అగర్వాల్, విష్ణు మంచు అక్కా, తమ్ముడిగా ఓ బంధంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. టాప్ హీరోయిన్‌గా కాజల్ ఉన్న సమయంలో హీరోకు అక్కగా నటించడం ఆసక్తిగా మారింది. కథలో ఉండే ఎమోషన్స్ కారణంగానే కాజల్ ఒప్పుకొన్నట్టు తెలిసింది. కాజల్, విష్ణు పోటాపోటీగా నటించగా..వారికి ధీటుగా నవదీప్, నవీన్ చంద్ర పాత్రలు ఉంటాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో..

తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో..

మోసగాళ్లు చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో షూట్ చేశారు. తెలుగులో 2021-03-19 రోజున రిలీజ్ అవుతుండగా, 2021లోనే ఇంగ్లీష్ భాషల్లో రూపొందించాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతగానే కాకుండా రచయితగా విష్ణు మంచు పనిచేశారు. చాలా సంవత్సరాలు గట్టిగా పరిశోధన చేశామని ఇటీవల విష్ణు మంచు సినిమా ప్రమోషన్స్‌లో వెల్లడించారు.

టాలీవుడ్‌కు సునీల్ శెట్టి

టాలీవుడ్‌కు సునీల్ శెట్టి

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తొలిసారి తెలుగు సినిమాలో పనిచేస్తున్నారు. ఐటీ స్కామ్‌ను శోధించే పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ సినిమాకు సునీల్ శెట్టి యాక్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారిందనే విషయం వైరల్‌గా మారింది.

మోహన్‌బాబు బర్త్ డే కానుకగా

మోహన్‌బాబు బర్త్ డే కానుకగా

మార్చి 19 విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు బర్త్ డే. తన తండ్రి పుట్టిన రోజు కానుకగా విష్ణు మంచు మోసగాళ్లు చిత్రాన్ని అభిమానులకు, ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందనను మూటగట్టుకొంటుందో వేచి చూడాల్సిందే.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు, సాంకేతిక నిపుణులు


విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర, రాజా రవీంద్ర తదితరులు
దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్
కథ, నిర్మాత: విష్ణు మంచు
సంగీతం: సామ్ సి ఎస్
సినిమాటోగ్రఫి: షెల్డన్ చావ్
బ్యానర్: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్: 2021-03-19

Recommended Video

Vishnu Manchu Meets Jagan Over Lunch | Mosagallu Movie Updates

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X