Most awaited Telugu films బొమ్మ పడిందా 1000 కోట్లు పక్కా.. మోస్ట్ వెయిటింగ్ తెలుగు సినిమాలో ఏమిటో తెలుసా?
బాహుబలి సిరీస్, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తీకేయ-2, సలార్ సినిమాలతో టాలీవుడ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అన్నట్లుగా ఉండేది. కానీ పాన్ ఇండియా కల్చర్ ఆ పరిస్ధితిని పూర్తిగా మార్చింది. హిందీ సినిమాల కంటే దక్షిణాది సినిమాలే ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. అందులో తెలుగు సినిమాలే ఎక్కువ. బాలీవుడ్‌లో ఒకప్పుడు టాలీవుడ్ హీరోలను పట్టించుకునేవారు కాదు. కానీ వారే ఇప్పుడు పిలిచిమరి అవకాశాలు ఇస్తున్నారు. తెలుగు నాట ఏ సినిమా రిలీజైనా ఆసక్తిగా గమనిస్తున్నారు. అవసరమైతే ఆ సినిమా హక్కులు కొనేసి హిందీలో రీమేక్ చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇక వచ్చే రెండేళ్లలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌ని టాలీవుడ్ శాసించనుంది. రూ. వందల కోట్లలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలు ఈ కాలంలోనే రిలీజ్ కానున్నాయి. వీటిలో కొన్నింటికి రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసే సత్తా ఉంది.
తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడానికి మరో ఐదు క్రేజీ ప్రాజెక్ట్‌లు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అవి పుష్ప-2, దేవర పార్ట్ - 1, ఓజీ, జై హనుమాన్, స్పిరిట్. ఈ సినిమాలు దేనికవే డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాగా.. అగ్ర కథానాయకులు నటిస్తూ ఉండటంతో వీటిపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాల కోసం ఒక్క టాలీవుడే కాదు.. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మూవీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా అలవోకగా రూ.1000 కోట్లను క్రాస్ చేయడం మాత్రం ఖాయం.

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దేవర'. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కొరటాల - ఎన్టీఆర్ కలయికలో వస్తోన్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. ఇందులో ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.. ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ను ఈ ఏడాది అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నారు.
వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది పుష్ప-2 గురించే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప-1 అంచనాలకు మించి సంచనాలు సృష్టించడంతో సెకండ్ పార్ట్ కోసం జనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్లు, గ్లింప్స్, ఫస్ట్ లుక్, అల్లు అర్జున్ గెటప్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా పుష్ప 2 రిలీజ్ కానుంది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుండగా.. విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ చేస్తున్నారు. అనసూయ, సునీల్, రావు రమేశ్, జగపతి బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న 'ఓజీ' ద్వారా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే చాలా వరకు సినిమా షూటింగ్ పూర్తయ్యింది. మధ్యలో ఎన్నికలు రావడంతో ఆయన రాజకీయాల్లో బిజీ అయ్యారు. పవన్ కళ్యాణ్‌కు సంబంధించి ఇంకా 15 రోజుల వర్క్ మిగిలి ఉండటంతో షూటింగ్ పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం జూన్ నెలాఖరు నుంచి జనసేనాని డేట్స్ ఇచ్చినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.
OG మూవీలో పవన్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నారట. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీయారెడ్డి, ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, షాన్ కక్కర్, హరీశ్ ఉత్తమన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఓజీని సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు.

ప్రశాంత్ వర్మ- తేజా సజ్జ కాంబినేషన్‌లో వచ్చిన 'హను-మాన్' బ్లాక్‌బస్టర్ కావడంతో దీనికి సీక్వెల్‌గా 'జై హనుమాన్' ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ మూవీలో ఆంజనేయుడి పాత్రను ఓ పాన్ ఇండియా స్టార్ పోషించనున్నారు. తేజ సజ్జా ఉంటాడు కానీ, అతను హీరో కాదని.. హనుమంతుడే హీరోగా అని చెప్పడంతో ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. 2025 సంక్రాంతి కానుకగా జైహనుమాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం 'స్పిరిట్'. యానిమల్‌తో బాలీవుడ్‌లో బలంగా జెండా పాతిన సందీప్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ జనాలే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. దానికి తోడు ప్రభాస్ హీరో అంటే అంచనాలు వేరే లెవల్లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రభాస్. కల్కి, రాజా సాబ్ సినిమాలతో బిజీగా వీటి షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. వీటి తర్వాత స్పిరిట్ సెట్స్‌పైకి వెళ్లనుంది.


Click it and Unblock the Notifications











