2011 సంవత్సరంలో టాలీవుడ్ వివాదాలు
మరికొన్ని రోజుల్లో 2011 సంవత్సరం అంతమై..2012వ సంవత్సరం రాబోతోంది. ఈనేపథ్యంలో ఈ సంవత్సరంలో టాలీవుడ్ వివాదాపై ఓసారి లుక్కేద్దాం.
రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఓసంచలనం సృష్టించింది. సీమ ఫ్యాక్షన్ గొడవల యదార్ధ ఘటనల ఆదారంగా రూపొందిన ఈ సినిమాలో..నిజ జీవితంలో పరిటాల రవి, మద్దెలచెర్వు సూరి మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్ ను సినిమా రూపంలో తెరకెక్కించారు. పరిటాల రవి పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించగా, మద్దెల చెర్వు సూరి పాత్రను హీరో సూర్య పోషించారు. ఈ సినిమా విడుదలై కొన్ని రోజులకే సూరి హైదరాబాద్ నడి ఒడ్డున జనవరి 3న హత్యకు గురయ్యాడు.
ఆ తర్వాత చెప్పకోదగ్గది టాలీవుడ్ డ్రగ్ రాకెట్! పలువురు నిర్మాతలకు, నటులకు మాదక ద్రవ్యాల కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించడమే కాదు, పలువురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కూడా. రవితేజ సోదరుడు రఘుబాబు, భరత్ లు డ్రగ్స్ కొంటూ పట్టబడగా, ఓ ఇద్దరు నిర్మాతలు డ్రగ్స్ అమ్ముతూ పట్టబడ్డారు. నటి జీవిత సోదరుడు కూడా ఈకేసులో పోలీసులకు చిక్కాడు. ఇక హీరో వరుణ్ సందేష్ కు డ్రగ్స్ కేసులో సంబంధం, అతనికి మత్తు పదార్ధాలు వాడే అలవాటు ఉన్నట్లు వచ్చిన వార్తలు ఆ మధ్య సర్వత్రా చర్చనీయాంశం అయింది.
మగధీర చిత్రం ద్వారా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ అగర్వాల్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ సంవత్సరం. అమ్మడు అక్కడ అడుగు పెట్టిన కొన్ని రోజులకే ఎఫ్ హెచ్ఎం పురుషుల మ్యాగజైన్ పై టాప్ లెస్ గా దర్శనం ఇచ్చింది. కాజల్ చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. బాలీవుడ్ అవకాశాల కోసం బరితెగించిందని దుమ్మెత్తి పోసినవాళ్లూ ఉన్నారు. అయితే కాజల్ మాత్రం అది నాఫోటోకాదు మార్ఫింగ్ అంటూ ఓ ప్రకటన చేసి ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ వారు మాత్రం ఇది రియల్ ఫోటో అంటూ ట్విస్ట్ ఇవ్వడం కొసమెరుపు.
ఇక... వాన, బంగారం చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా హత్య కేసులో ఇరుక్కుంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి అతని భార్యను చంపిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల మరణించి ప్రముఖ నిర్మాత, రచయిత ఎంఎస్ రెడ్డి రాసిన తన ఆత్మకథ పుస్తకం'ఇది నా కథ'. ఈ పుస్తకంలో సీనియర్ ఎన్టీఆర్ పిసినారితనం గురించి, జూనియర్ ఎన్టీఆర్ అహంభావం, చిరంజీవి మూలంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, గుణశేఖర్ గుణవంతుడు కాడనే విషయాలు వెల్లడించి సంచలనం సృష్టించారు.
ఆ మధ్య రామ్ చరణ్ తేజ్ దాసరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం సృష్టించాయి. నిర్మాతలకు, కార్మికులకు మధ్య ఏర్పడ్డ విబేధాలతో కొంత కాలం సినిమా షూటింగులు ఆగి పోయాయి. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పలు సినిమా షూటింగులపై దాడులు గట్రా జరిగాయి. ఎన్నడూలేని విధంగా ఈ సంవత్సరం నందమూరి, మెగా కుటుంబాల హీరోల అభిమానుల వివాదాలు రచ్చకెక్కాయి.


Click it and Unblock the Notifications











