RRR: టైగర్, తోడేలు.. సినిమాలో ఇంకా భయంకరమైనవి ఏమేమి ఉన్నాయంటే... అలా లీక్ చేసేసిన తారక్

RRR సినిమా పై రోజురోజుకు అంచనాలు స్థాయి అమాంతంగా పెరిగి పోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ అలాగే పాటలు కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకున్నాయి. దానికి తోడు ఈ చిత్ర యూనిట్ సభ్యులు సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెగ్యులర్ గా ఇస్తున్న ఇంటర్వ్యూలలో సినిమా లోని అనేక సన్నివేశాల గురించి మాట్లాడుకుంటూ చాలా విభిన్నంగా చెబుతున్నారు. అయితే సినిమాలో వివిధ రకాల భయంకరమైన జీవులను కూడా చూపించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ కూడా ఒకటి లీక్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

 సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం పక్కా..

సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం పక్కా..

అందరి ఫోకస్ ప్రస్తుతం RRR సినిమా పైనే ఉంది. ఈ సినిమాను ఎలాగైనా మొదటిరోజు మొదటి షో చూడాలి అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక చాలా ఏరియాల్లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ కావడంతో నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈసారి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే RRR సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వరుస ఇంటర్వ్యూలతో..

వరుస ఇంటర్వ్యూలతో..

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు టీజర్ ట్రైలర్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఆఫ్ ద రికార్డు మాట్లాడుతున్నట్లుగా చేసిన ఒక ఇంటర్వ్యూ కూడా వైరల్ గా మారింది.

టైగర్ సీన్ హైలెట్

టైగర్ సీన్ హైలెట్

అయితే సినిమాలో నార్మల్ యాక్షన్ సినిమా ఎపిసోడ్స్ మాత్రమే కాకుండా ఇతర మృగాలతో కూడా దర్శకుడు గట్టి ప్రయోగాలు చేసినట్లుగా తెలుస్తోంది. సినిమాలో అతి భయంకరమైన మృగాలతో కూడా హీరోలిద్దరూ గట్టిగానే పోరాడతారట. ట్రైలర్ లో అయితే అతిపెద్ద టైగర్ చూపించారు. సినిమాలో కూడా ఆ సీన్ చాలా హైలెట్ గా ఉంటుందని చెప్పారు. అయితే ముందు టైగర్ కు సంబంధించిన గ్రాఫిక్స్ చేసిన తర్వాతనే జూనియర్ ఎన్టీఆర్ సీన్స్ ను క్రియేట్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు.

 తోడేలు సీన్

తోడేలు సీన్

ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోని ఇతర జీవుల గురించి కూడా మాట్లాడాడు. ఈ సినిమాలో ఒక తోడేలు కు సంబంధించిన సన్నివేశం కూడా హైలెట్ గా ఉంటుంది అని ఆ సన్నివేశంలో నేను చాలా ఆశ్చర్యపోయాను అని చాలా అద్భుతంగా ఎపిసోడ్ వచ్చినట్లుగా తెలియజేశాడు. తోడేలు చాలా స్పీడ్ గా ఉంటుంది కాబట్టి నేను కూడా చాలా స్పీడ్ గా రియాక్ట్ కావాల్సి వచ్చింది అని తెలియజేశాడు.

 అతిపెద్ద అనకొండ

అతిపెద్ద అనకొండ

అయితే వాటర్ తోనే అనకొండా కు సంబంధించిన సన్నివేశాలు కూడా డా బాగా ప్రజెంట్ చేసినట్లు తెలియజేశారు. వాటర్ ప్రెషర్ ఎక్కువగా ఉండేలా చాలా రకాల పైపులు తీసుకునే అనకొండ కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేసినట్లు చెప్పారు. సినిమాలో ఆ సన్నివేశం కూడా చాలా హైలెట్ గా ఉన్న పోతున్నట్లు తెలుస్తోంది.

మొసలి కూడా..

మొసలి కూడా..

సినిమాలో మొత్తంగా దర్శకధీరుడు రాజమౌళి వివిధ రకాల అడవి మృగాలను చాలా బలంగా వాడినట్లు తెలుస్తోంది. చివరి ఎపిసోడ్లో అయితే హీరోలు ఇద్దరితో కలిసి వారి పెంపుడు మృగాలను కూడా బ్రిటిష్ వారిపై ఉసి గోలుపుతారు అని ఇదివరకే ఒక టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో మొసలికి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ కూడా అద్భుతంగా ఉంటుందట. మొత్తంగా సినిమాలో పులి తోడేలు అనకొండ మొసలి ఇలా అతి భయంకరమైన జీవాలను రాజమౌళి ఎలా ప్రెజెంట్ చేసి ఉంటాడు అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X