మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. మరోసారి వాయిదా.. న్యూ రిలీజ్ డేట్!

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గత కొంతకాలంగా విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే రెండు మూడు సార్లు ఈ సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటించి మళ్లీ క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని అక్కినేని అఖిల్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. అలాగే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని మళ్లీ ఫామ్లోకి రావాలని చూస్తున్నాడు. ఈ దర్శకుడు బొమ్మరిల్లు అనంతరం పరుగు సినిమాతో స్టార్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన ఆరెంజ్ సినిమా అతని కెరీర్ ను ఒక్కసారిగా కిందకు లాగేసింది.

ఆ తర్వాత ఎలాంటి సినిమాలు చేసినా కూడా భాస్కర్ సరైన సక్సెస్ అయితే అందుకోలేదు. కానీ అతనిపై ఇండస్ట్రీలో నిర్మాతలకు మాత్రం ఒక మంచి నమ్మకం ఉంది. భాస్కర్ సరైన కథను సెట్ చేసుకుంటే తప్పకుండా మళ్లీ ఫామ్ లోకి రావచ్చు అని ఇది వరకే చాలామంది నిర్మాతలు అతనికి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక భాస్కర్ కూడా సరైన కథ కోసం కొంత సమయం తీసుకున్నాడు. ఇక ఫైనల్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కథను అల్లు అరవింద్ కు వివరించగా ఆయన సింగిల్ సిట్టింగ్ లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ GA2 బ్యానర్లో సినిమాను నిర్మించే అవకాశం ఇచ్చారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ ఏడాది మొదట్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అలాగే సమ్మర్ లో కూడా విడుదల చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఒక వైపు కరోనా వైరస్ మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లు భారీగా తగ్గడంతో సినిమాను వాయిదా వేసుకోవలసి వచ్చింది.

Most eligible bachelor new official release date announcement

మొత్తానికి ఈ దసరా బరిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ తో పాటు విడుదల తేదీని కూడా చిత్రం యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. ఈ సినిమాలో అఖిల్ సరసన గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని ఒక పాటకు యువత నుంచి మంచి స్పందన లభించింది. సినిమా కూడా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక దర్శకుడు కూడా రెగ్యులర్ ప్రమోషన్ తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు.

ఇక ప్రస్తుతం అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో అఖిల్ విభిన్నమైన స్టైల్ లో కనిపించనున్నాడు. ఫిట్నెస్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చేశాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి సైరా అనంతరం మరో పాన్ ఇండియా సినిమాను తెరపైకి తెస్తారేమో అనుకుంటే ఎవరూ ఊహించని విధంగా అఖిల్ తో యాక్షన్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది. ఏజెంట్ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X